మార్చి 27 టీడీపీ కండువా కప్పుకోనున్న జయసుధ శీర్షికతో నాడు తెలుగు విశేష్ చెప్పింది.. నేడు నిజమైంది. నాటి కథనం ఇవాళ వాస్తవ రూపం దాల్చనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యక స్థానాన్ని ఏర్పర్చుకున్న సహజనటి జయసుధ త్వరలో రాజకీయ పార్టీని మారనున్నారని.. అమె టీడీపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారని నాడు తెలుగు విశేష్ కథనాన్ని ప్రచురించింది. అయితే నిజమేనా.. కేవలం మా ఎన్నికలలో మాత్రమే అమె టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ తో జతకట్టి బరిలో నిలిచారని, కానీ అమె పార్టీ మారడంపై మాత్రం అంత ఖచ్చితంగా చెప్పలేమని చెప్పిన రాజకీయ విశ్లేషకులు చెపినా.. అమె టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఖచ్చితంగా చెప్పింది మాత్రం తెలుగు విశేష్ ఒక్కటే. ఇప్పుడు అదే నిజమైంది. అమె సైకిల్ పై రివ్వురివ్వున షికారు కోట్టేందుకు విజయవాడుకు కూడా చేరుకున్నారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉంటున్న అమె.. త్వరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారని.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన అనంతరం ఈ మేరకు అమె నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఆమె శనివారంనాడు విజయవాడకు చేరుకున్నారు.
Also Read: టీడీపీ కండువాను కప్పుకోనున్న జయసుధ..?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్భలంతో అమె రాజకీయాలోకి ప్రవేశించి.. రావడంతోనే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపోందారు. అయితే గత ఎన్నికలలో ఆఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు చేతిలో ఓటమిపాలైన అమె ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ నేతలు బుజ్జగించడంతో ఆమె వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని జయసుధ అప్పట్లో ప్రకటించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జయసుధ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన జయసుధ.. ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని.. ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్టు చెప్పారు. చంద్రబాబు ఎలా దారి చూపిస్తే అలా నడుస్తానని చెప్పారు. తెలుగు మాట్లాడేవారందరికీ తానేంటో తెలుసునని అన్నారు. బంధుత్వ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తో తనకు అనుబంధం ఎక్కువని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశానని గుర్తు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more