Protest going on in Hyderabad Central University

Protest going on in hyderabad central university

Rohith Suicide, Rohith, HCU, Hyderabad, Hyderabad central University

On Rohith suicide, Hyderabad Central University on fire. The Students doing protest for Justice on Rohith Suicide.

HCU విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తేసినా ఆగని మంటలు

Posted: 01/22/2016 09:40 AM IST
Protest going on in hyderabad central university

హెచ్.సి.యులో అంతకంతకు రాజకీయాలు ముదురుతున్నాయి. విద్యార్థి రోహిత్ మరణం మీద ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘం నాయకులు స్వరం మార్చారు. కొత్త డిమాండ్లను తెర మీదకు తీసుకువస్తూ.. తమ నిరసనను కొనసాగిస్తున్నారు. హెచ్ సీయూ పాలకమండలి నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే, సస్పెన్షన్ ఎత్తివేసినంత మాత్రాన సరిపోదంటున్న విద్యార్థులు.. తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోహిత్ ఆత్మహత్యపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటనకు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలే కారణమంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వారిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్ష కొనసాగుతోంది.

హైదరాబాద్ యూనివర్సిటీలో ఆందోళనలు జరుగుతున్న టైంలోనే యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ప్రశాంత్, విజయ్, శేషయ్య, సుంకన్న మీద తీసుకున్న క్రమశిక్షణా చర్యల్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. నలుగురి మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. వారు వెంటనే తరగతులకు హాజరుకావచ్చని సూచించింది. అయితే కోర్టు తీర్పునకు లోబడే ఈ సస్పెన్షన్ ఉంటుందని హెచ్ సీయూ స్పష్టం చేసింది. మరోపక్క ఈ గొడవలకు కేంద్ర బిందువుగా ఉన్న ఏబీవీపీ తొలిసారి స్పందించింది. తాము న్యాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తే కొంతమంది కావాలనే కుల రాజకీయాలు చేస్తున్నారని విద్యార్థి సంఘం నేత సుశీల్ కుమార్ ఆరోపించారు.  రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమన్న ఆయన.. ఈ కేసులో బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith Suicide  HCU  Hyderabad  Hyderabad central University  

Other Articles