KaapuNadu calls stike on Kaapunadu

Kaapunadu calls stike on kaapunadu

Kaapu Nadu, Mudragada Padmanabham, Kaapu reservations, Kaapu

KaapuNadu calls stike on Kaapunadu Mudragada Padamanabham calls for strike for Kaapu reservations in Ap.

ITEMVIDEOS: రోడ్డెక్కి గర్జిస్తున్న కాపులు

Posted: 01/31/2016 03:55 PM IST
Kaapunadu calls stike on kaapunadu

కాపు రిజర్వేషన్ల మీద కాపునాడు గర్జించింది. తునిలో అట్టహాసంగా.. లక్షల మంది కాపులు కాపునాడుకు తరలిరాగా.. ముద్రగడ పద్మనాభం ప్రారంభించారు. అయితే తాము చేపడుతున్న కాపుగర్జన సభను సీఎం చంద్రబాబు అడ్డుకోవాలని చూశారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. తునిలో జరుగుతున్న కాపు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ సభ కోసం స్కూల్‌, ఆర్టీసీ బస్సులు ఇవ్వొద్దని... చంద్రబాబు ఆదేశాలిచ్చారని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వంతో అటోఇటో తేల్చుకుంటామని సభ ముఖంగా ఆయన హెచ్చరించారు. ఉద్యమిస్తే కానీ ఈ ప్రభుత్వం దిగిరాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చేదాకా ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల... కాపులు అయోమయానికి గురవుతున్నారని ముద్రగడ విమర్శించారు.

కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తునిలో జరుగుతున్న కాపుగర్జనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే వరకూ తాను, తన కుటుంబం నడి రోడ్డు పైన, రైలు పట్టాలపైన గడిపేందుకు సిద్ధమని ఆయన చెప్పారు. తనతో పాటు కలిసి నడవడానికి సిద్ధమా అని అక్కడున్న ప్రజలను ముద్రగడ ప్రశ్నించారు. కాపులకు ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ క్షణం నుంచి తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ రోడ్లపైనే పడుకుంటామని ముద్రగడ చెప్పారు. అలా చెప్పి ఒక్కసారిగా.. వేదిక మీద నుండి రోడ్ల మీదకు, రైలు పట్టాల మీదకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లక్షల మంది కాపు వర్గీయులు రోడ్డు, రైలు పట్టాలకెక్కడంతో పరిస్థితి తారుమారైంది. సభ మాత్రమే నిర్వహించుకుంటారని అనుకుంటే.. ముద్రగడ పద్మనాభం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అందరూ షాకయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అధికారులు, పోలీసులు భయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaapu Nadu  Mudragada Padmanabham  Kaapu reservations  Kaapu  

Other Articles