Hyderabadis are not interested in voting

Hyderabadis are not interested in voting

GHMC, GHMC Elections, Hyderabadies, Hyderabad, GHMC Polls

In the GHMC elections Hyderabadies voted very less. There is only 32 percent voting till afternoon 2o clock

ITEMVIDEOS: నిరాశపరిచిన ఓటింగ్ శాతం

Posted: 02/02/2016 04:59 PM IST
Hyderabadis are not interested in voting

ఈసారి కూడా హైదరాబాద్ వాసులు ఓటింగ్ కు ముందుకు రాలేదు. గతంలో కన్నా ఓటింగ్ వాతం ఈసారి ఖచ్చితంగా పెరుగుతుంది అని అందరూ బావించినా కానీ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 22 శాతం ఓటింగ్ నమోదు కావడం.. మధ్యాహ్నం రెండు గంటలకు 32 శాతం నమోదు కావడం అందరిని నిరాశపరిచింది. మొత్తం 150 డివిజన్లకు 7,802 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు



ఎక్కడా ఏ డివిజన్ లో కూడా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదని, ప్రారంభం నుంచి ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతుందని ఆ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీజీపీ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల సిబ్బందికి ఆహారం సరిగా పంపిణీ చేయని చైతన్యపురి సీఐపై వేటు వేశారు. ఉదయం సిబ్బంది టిఫెన్ కోసం ఇచ్చిన సొమ్ము కాజేశాడని ఆ సీఐ పై ఆరోపణ రావడంతో ప్రస్తుతానికి సస్పెండ్ చేసి, ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Elections  Hyderabadies  Hyderabad  GHMC Polls  

Other Articles