Haryana Govt Denies Any Gang Rapes Happened During Jat Protest

Haryana govt denies any gang rapes happened during jat protest

haryana, Punjab, Jat, Jat rotest, Reservations

The Punjab and Haryana High Court has taken suo-motu cognizance of news reports about mass gang rapes of women in Haryana's Murthal during the Jat reservation protest and subsequent blockade.

ఉద్యమం చేస్తూనే ఆడవాళ్ల మీద అత్యాచారం

Posted: 02/26/2016 03:31 PM IST
Haryana govt denies any gang rapes happened during jat protest

ఓబీసీ కోటా కోసం ఉద్యమించిన జాట్లలో కొంతమంది అత్యాచారపర్వానికి తెగబడుతున్నారు. ఆందోళనలో భాగంగా ఓ పక్కన ఆందోళన చేస్తూనే... మరోపక్క కార్లను ఆపి అత్యాచారాలు చేశారు. హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లా ముక్తాల్ సమీపంలో హైవేను ఆందోళనకారులు దిగ్బంధించారు. కాసేపటికి భద్రతా దళాలు అక్కడకు చేరుకుని లాఠీచార్జ్ చేసి తరిమేశాయి. సమీపంలోని పొలాల్లోకి పారిపోయిన 30 మంది ఆ తరువాత రోడ్డుమీదకు వచ్చి దారినపోతున్న వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో వాటిలోని పురుషులు పారిపోగా దుండగులు ఆ వాహనాలకు నిప్పు పెట్టారు.
 
పారిపోలేక భయంతో వణుకుతున్న సుమారు 10 మంది మహిళలను దుండగులు పొలాల్లోకి లాక్కెల్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఆక్రందనలు విని అక్కడకు వచ్చిన సమీప హసన్‌పూర్, కురద్ గ్రామస్థులు వారికి దుస్తులు, దుప్పట్లు ఇచ్చారు. అనంతరం వారిని అక్కడికి కిలో మీటర్ దూరంలో ఉన్న ఒక దాబాలో తలదాచుకున్న కుటుంబాలకు అప్పగించారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. బయటకు చెబితే పరువుపోతుదంటూ బాధితులను తిరిగి వారు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haryana  Punjab  Jat  Jat rotest  Reservations  

Other Articles