The Indian temple which grants US visas

The indian temple which grants us visas

India, Visa Venkateshwara, US Media, Chilkur Balaji

It is Donald Trump's worst nightmare: Every day thousands of Indians flock to a Hindu temple seeking to get one wish granted - a U.S visa. The Chilkur Balaji temple near Hyderabad in southern India has now become known as the 'visa temple' after many devotees have had visa success, following a pilgrimage there.

వీసా వెంకన్న మీద అమెరికా మీడియా కథనం

Posted: 02/27/2016 12:53 PM IST
The indian temple which grants us visas

వీసా కావాలంటే  వెంకన్నను వేడుకోండి..అమెరికా రావాలంటే  ఆపద మొక్కుల వాన్ని అడగండి. ప్రపంచంతో కనెక్ట్ కావాలంటే కలియుగ దైవాన్ని కోరుకోండి అంటుంది అంతర్జాతీయ మీడియా. వీసా సమస్యలకు ఇండియాలో డివైన్ హెల్ప్ సెంటర్ ఉందంటూ అమెరికన్ టీవీ ఛానల్ సిఎన్ఎన్ స్పెషల్ స్టోరి వేసింది ఆపదమొక్కులవాడు అమెరికన్ మీడియాను అట్రాక్ట్ చేస్తున్నాడు..ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ ను ఓ దేవుడు నిజం చేస్తున్నాడంటుంది సిఎన్ఎన్. వీసా సమస్యలతో పరేషాన్ అవుతున్న ఇండియన్స్ కష్టాలకు చిలుకూరు బాలాజీ చెక్ పెడుతున్నాడని ప్రత్యేక కథనం రాసింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు టెంపుల్ మహత్యం గొప్పదంటుంది సిఎన్ఎన్. 500 ఏళ్ల చరిత్రున్న ఈ గుడిలో కొలువైన శ్రీనివాసున్ని మనస్పూర్తిగా అడిగితే ఏ సమస్య నుంచైనా బయటపడొచ్చు.  ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకుని వీసా రాక బాధపడే వారు గుడికొచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే చాలు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వీసా వచ్చిన వాళ్లు 108 ప్రదక్షిణలు చేసి వెంకన్నకు థాంక్స్ చెపుతారు. ఇందుకు బ్రెస్సెల్స్ లో ఉన్న మంజునాథ్ చెల్లెలే సాక్ష్యమన్నది సిఎన్ఎన్. చిలుకూరు బాలాజీని తాను ఓ కోరిక కోరానని…అది నెరవేరిన తర్వాత మళ్లీ వస్తానంది సీఎన్ఎన్ రిపోర్టర్ అలెగ్జాండ్రియా. చిలుకూరు బాలాజీ మహిహలు అమెరికాకు కూడా తెలిసాయి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : India  Visa Venkateshwara  US Media  Chilkur Balaji  

Other Articles