పార్లమెంటు శివంగిగా చెలరేగి విపక్షాల నోట మాటను రానీయకుండా చేసిన బీజేపీ మహిళా నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసినదంతా మెలోడ్రామానా..? అంటే అవుననే సమాధానాన్ని వ్యక్తం చేసిందట పార్టీ అధిష్టానం. నమ్మడానికి ఇది కాస్త విడ్డూరంగా వున్న.. స్మృతి ఇరానీ ఇకపై మెలో డ్రామాను ఆపేయండీ.. అంటూ అధిష్టానం ఖచ్చితమైన అదేశాలను జారీ చేసిందట. హైదరాబాదు సెంట్రల్ వర్సిటీలో రిసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా ర్యాలీ, జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో నెలకొన్న వివాదంపై అమె పార్లమెంటులో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆమె ఓ పాంప్లెట్ ను చేతబట్టుకుని చేసిన ఉద్వేగభరిత ప్రసంగం నరేంద్ర మోదీ సర్కారును ఇరుకున పడేసింది. పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. అయినా వ్మృతి ఇరానీ చేసిన ప్రసంగానికి మంత్రముగ్గుడైన ప్రధాని ఆదే రోజున సాయంత్రం సత్యమేవ జయతే అంటూ ట్విట్ చేసి అమెను అభినందించినా.. అధిష్టానం మాత్రం అమెను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.
స్మృతి ఇరానీ ప్రసంగంపై బీజేపీ అధిష్ఠానం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్నే కాక పార్టీని ఇరుకునపెట్టే ప్రసంగాలు వద్దంటూ అదేశాలు జారీచేసింది. ఇకపై ఇలాంటి ‘మెలోడ్రామా’ ప్రసంగాలు వద్దంటూ ఆమెకు కాస్తంత గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయా విషయాలపై సభలో మాట్లాడే ముందు పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించాలని కూడా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద పయనీర్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. కాగా ఒక్క ప్రసంగంతో స్మృతి తన రాజకీయ పరిపక్వతను, పరిజ్ఞానం, దేశభక్తిని దేశ ప్రజలతో పాటు ప్రత్యర్థి పార్టీలకు కూడా చాటినట్లయ్యింది. ఈ నేపథ్యాన్నే కొనసాగించిన పక్షంలో అమె వచ్చే ఎన్నికల నాటికి మోదీని కూడా పక్కన బెట్టి ప్రధాని కాగల టాలెంట్ వుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తాయని అధిష్టానం ఇలా చర్యలు తీసుకుంటుందన్న అరోపణలు వినబడుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more