Telangana and Maharashtra to Sign MoUs on Five Barrages

Telangana and maharashtra to sign mous on five barrages

Telangnaa, maharastra, Devendra Fadnavis, MoU, Projects

Chief Minister K Chandrasekhar Rao and Maharashtra Chief Minister Devendra Fadnavis will script a new history on Tuesday by signing five MoUs in Mumbai on construction of irrigation projects. Unlike other states in the country, both the states sought each other’s objections over sharing the river waters and will be signing the MoUs on the projects which will be beneficial to most backward areas in both Maharashtra and Telangana states.

తెలంగాణ చరిత్రలో నిలిచే మహా ఒప్పందం

Posted: 03/09/2016 07:20 AM IST
Telangana and maharashtra to sign mous on five barrages

తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తెంలగాణ సర్కార్ కు, మహారాష్ట్రతో ఐదు బ్యారేజ్‌ల నిర్మాణంపై చరిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.గతకొంత కాలంగా మహారాష్ట్రతో ఈ మేరకు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించిన కేసీఆర్ ఠఆ దిశగా విజయాన్ని సాధించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలు ఐదు బ్యారేజ్ లను నిర్మిస్తాయి. ముంబైలోని వేదికగా ఆవిష్కృతమైన ఈ చారిత్రక ఘట్టంలో తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.


వీటిలో రాజుపేట, పింప్రాడ్ రిజర్వాయర్లు మహారాష్ట్ర పొలాలను సాగుచేస్తాయి. చనాకా-కొరాటా, తుమ్మిడిహట్టి, కాళేశ్వరం (మేడిగడ్డ) తెలంగాణ భూముల్లో సిరులు పండిస్తాయి. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలను, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసుకోవడానికి పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరింది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్-1979 (తదుపరి నివేదిక 1980) పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికీ ఈ బోర్డు సర్వ పర్యవేక్షణ సంస్థగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు.. 1.లెండి ప్రాజెక్టు, 2.ప్రాణహిత ప్రాజెక్టు (తుమ్మిడిహట్టి బ్యారేజీ), కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (మేడిగడ్డ బ్యారేజీ), 3.పెన్‌గంగపై చనాక-కొరాటా మధ్య బ్యారేజీ, 4.పెన్‌గంగపై పింప్రాడ్ వద్ద బ్యారేజీ, 5.పెన్‌గంగపై రాజుపేట్ వద్ద బ్యారేజీ, 6.లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangnaa  maharastra  Devendra Fadnavis  MoU  Projects  

Other Articles