Pakistan media blames India on Pathankot attack

Pakistan media blames india on pathankot attack

Pakistan, Pathankot, India, Pakistan Media

Pakistan media blames India on Pathankot attack. Pakistan media publishing some article aganist the Indias arrgument

పఠాన్ కోట్ దాడిపై పాక్ మీడియా అవాకులు

Posted: 04/05/2016 01:33 PM IST
Pakistan media blames india on pathankot attack

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడిపై పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. అసలు ఉగ్రదాడి అన్నదే భారత్ ఆడిన నాటకం అని, పాకిస్తాన్ బృందం దర్యాప్తు చేసి ఇదే విషయం తెలిపిందని వార్తలు ప్రచారం చేస్తోంది. ఇది నిజమనడానికి ఆధారం యూపీలో ఎన్ఐఏ అధికారి హత్య అంటూ తన తప్పుడు వార్తలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. జనవరి 2న గుజరాత్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రమూక జరిపిన దాడిలో ఏడుగురు జవానులు అమరులవ్వగా, ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. అయితే ఇవన్నీ తప్పుడు ప్రచారమే అని, అసలు అటువంటివేమీ జరగలేదంటూ పాక్ మీడియా నిజాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది.

ఇక భారత్ ఈ నాటకం ద్వారా అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఓ దోషిగా చూపించేందుకు ఈ కుట్ర జరిగిందని, ఇది స్వయంగా దర్యాప్తు బృందంలోని ఓ వ్యక్తి తెలిపారని  'పాకిస్థాన్ టుడే' ఓ సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించింది. ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుపెట్టాయని, అయితే ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించేందుకే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించినట్లు బిల్డప్ ఇచ్చిందని, ఇదంతా పాకిస్తాన్‌పై విషం చిమ్మేందుకే అంటూ పాక్ మీడియా పేర్కొంటోంది.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Pathankot  India  Pakistan Media  

Other Articles