Jr NTR Fined By Hyderabad Traffic Police

Ntr fined by hyderabad police

NTR Fined Rs 700 By Hyderabad Police, NTR fined by Hyderabad police for black film on car windows, NTR paid 700 rupees fine for black film on car windows, Jr NTR fined by Hyderabad police,Jr NTR, RTA officials, hyderabad traffic police, black film, car windows, supreme court

Young Tiger NTR has found himself in a slightly embarrassing situation this evening. The actor's car was stopped by the city's traffic police when they noticed that the car windows are still covered with the black film. This is in violation of a Supreme Court's ruling.

యంగ్ టైగర్ ఎన్టీయార్ కు పోలీసుల ఝలక్..

Posted: 04/06/2016 09:07 PM IST
Ntr fined by hyderabad police

సీనీహీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. నిబంధనలు పాటించనందుకు ఎన్టీఆర్ కారు(ఏపీ 37  ఏఎక్స్ 9999)కు జరిమానా విధించారు. కారు అద్దాలకు నల్లటి ఫిల్మ్ ఉండడంతో బుధవారం రూ.700 ఫైన్ వేశారు. అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తా నుంచి సారథి స్టూడియోవైపు వెళుతుండగా కారును ఆపి చలానా రాసినట్టు పోలీసులు తెలిపారు. అనేక మంది వాహన చోదకులు తమ వాహనాలను నిబంధనల ప్రకారం నడిపించడం లేదని పిర్యాదులపై స్పందించిన రోడ్డు రవాణ సంస్థ అధికారులు ఇవాళ అమీర్ పేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 37  ఏఎక్స్ 9999 కారు నల్లటి ఫిల్మ్ లకు అద్దాలకు అంటించుకుని వెళ్తుండటాన్ని గమనించిన అధికారులు కారును నిలిపి జరిమానా విధించారు, అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ కారులోనే ఉన్నారు. చలానా చెల్లించి ఆయన వెళ్లిపోయారు. ఈ వార్త హైదరాబాద్ లో హాట్ టాఫిక్ గా మారిపోయింది. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే తొలగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. నగరంలోకి వచ్చే వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆ ఆదేశాల్లో పేర్కొంది. మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే జరిమానా విధించే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  RTA officials  hyderabad traffic police  black film  car windows  supreme court  

Other Articles