ప్రపంచవ్యాప్తంగా పోర్న్ సినిమాలు తమ సత్తాను చాటుకుని బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ది చెందుతున్నాయి, ఫోర్న్ రంగంలో కెరీర్ ను వెతుక్కునే యువతులు కూడా పలు దేశాలో వున్నారంటే అతిశయోక్తి కాదు. ఫోర్న్ స్టార్ గా వెలిగిపోవాలని కొందరు కలలు కంటున్న తరుణంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం చిత్రాలతో అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తమ దేశాలలో చిన్నారి బాలబాలికలు కూడా పెడదారి పడుతున్నారని, అంతేకాకుండా యువతలోనూ ఈ చిత్రాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని పలు దేశాలు అందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సమస్యకు వాటిని నిషేధించడం ఒకటే పరిష్కారమని భావవిస్తున్న తరుణంలో మరో ఒక సమస్య వచ్చి పడుతుంది, దేశానికి అదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఈ సైట్లను నిషేధిస్తే.. ఆదాయం కూడా రాదని, అప్పడు అభివృద్ది కుంటుపడుతుందని దేశాలు భావిస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఫోర్న్ చిత్రాలపై సెన్సార్ ను పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వాలకు సెక్స్ వర్కర్ల నుంచి ఒత్తిడి వచ్చి పడుతుంది, విద్యార్థులకు చక్కని విద్యను అందంచేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలని, పాఠశాలలో వారికి సెక్స్ ఎడ్యూకేషన్ కూడా ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. స్కార్ లెట్ అనే ఉన్నత సెక్స్ వర్కర్ల అసోసియేషన్ ఈ మేరకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది,
దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ ఐడియా వేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అదేంటంటే స్కూల్స్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వివరించేందుకు సెక్స్ వర్కర్ల సలహా తీసుకోవాలని. అవసరమైతే వారి ద్వారా ప్రాక్టికల్‌గా కూడా చెప్పించాలని భావిస్తోంది. దీని వల్ల చిన్న పిల్లలు పోర్న్ పట్ల పెద్దగా ఆకర్షితులు కాకుండా ఉంటారని ఆశిస్తోంది. చిన్న వయసులోనే సెక్స్ ప్రాధాన్యం గురించి, సురక్షిత శృంగారం గురించి పిల్లలకు ఆవగాహన కలిగిస్తే వారు పెడధోరణుల జోలికి పోకుండా ఉంటారని ఆసీస్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే సెక్స్ వర్కర్లను వినియోగించుకోవాలని యోచిస్తోంది. శృంగారం గురించి ఓపెన్‌గా డిబేట్‌లు నిర్వహించడం, కండోమ్‌లు, పోర్న్ తదితర వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తారట. అదే సమయంలో మహిళల పట్ల సభ్యత, సంస్కారంతో ఎలా మెలగాలని, మహిళలపై దౌర్జన్యాలు, హింసలు, వేదింపులను కూడా వివరించనున్నారట.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more