బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణం తరువాత ఎక్కడ చర్చ జరిగినా, రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రేయసి సలోనీ శర్మ పేరు వినిపిస్తూనే ఉంది. అమె ప్రత్యూషపై దాడి చేసిందని, ప్రత్యూష అత్మహత్య కేసులో అమె ప్రమేయం కూడా వుందని వార్తలు పతాక శీర్షికలుగా మారుతున్న క్రమంలె అమె ఈ మొత్తం ఘటనపై ఆమె తొలిసారిగా నోరు స్పందించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఔను నేను ప్రత్యూషను కోట్టాను, అది కేవలం ప్రతీకార దాడి మాత్రమేనని చెప్పారు. తనపై రాహుల్ రాజ్ సింగ్, ప్రత్యూషలు దాడి చేసిన తరువాతే తాను వారిపై దాడికి పాల్పడ్డానని అంగీకరించారు.
ఫిబ్రవరి 11న రాహుల్ అక్కడ ఉన్నాడని తెలుసుకుని, తాను కాండివ్లీ అపార్టు మెంటుకు వెళ్లానని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. "నేను రాహుల్ కు ఇచ్చిన డబ్బును ఆయన ప్రత్యూషకు ఇచ్చాడు. తిరిగి డబ్బు చెల్లించాలంటే రాహుల్ వినలేదు. దాంతో నాకు కోపం వచ్చి డబ్బు కోసం నిలదీసేందుకు అక్కడికి వెళ్లాను. నన్ను చూడగానే రాహుల్, ప్రత్యూషలు రెచ్చిపోయారు. ఇద్దరూ కలసి దాడి చేశారు. ఫ్లాట్ బయటకు నన్ను నెట్టేశారు. కోపంతో నేను ఆమెను కొట్టాను" అని సలోనీ శర్మ చెప్పారు.
అయితే ప్రత్యూషపై చేయి చేసుకున్న అంశాన్ని పెద్దదిగా చేసి చూపడాన్ని, అమె ఆత్మహత్యకు తనకు లెంకపెట్టడాన్ని అమె తప్పుబట్టారు, తన డబ్బు తిరిగి చెల్లించమని అడిగేందుకు మాత్రమే తాను రాహుల్ కోసం వెళ్లగా అక్కడ అనుకోకుండా గొడవ జరిగిందని చెప్పారు. ఆ వేంటనే తాను స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టగా, వారిద్దరూ వచ్చి తనను బతిమాలుకున్నారని, పోలీసులు కూడా, ప్రజల దృష్టిలో పడాల్సి వస్తుందని హెచ్చరించడంతో కేసు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. మొత్తం ఉదంతంపై పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చానని సలోనీ శర్మ తెలిపారు. అంతేకానీ ప్రత్యూషతో తనకు వ్యక్తిగత విభేధాలు ఏమీ లేవని సలోనీ శర్మ తెలిపారు
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more