బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కు పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్ వెళ్లేందుకు ఇవాళ కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చిన 'బజరంగీ భాయిజాన్' దర్శకుడికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకారులు నిరసన పర్వానికి తెరతీశారు. అటు కబీర్ ఖాన్ తో పాటుగా ఇటు భారత్ దేశానికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు.
ఒక వ్యక్తి బూటు చేత్తో పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ ఖాన్ వెంట పడ్డాడు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీన్ని సహించబోమంటూ పదేపదే హెచ్చరించాడు. కరాచీలో ఓ సదస్సులో పాల్గొనడానికి కబీర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లారు. కబీర్ ఖాన్ తీసిన పాంటమ్' సినిమా పాకిస్థాన్ లో వివాదాస్పమైన కారణంగా అయన రాకను ముందుగానే తెలుసుకున్న కొంతమంది నిరసన కారులు అందోళనకు దిగారు. అయితే అందోళనకారులను అక్కడి ప్రభుత్వం నిలవరించకుండా చేష్టలుడికి చూసింది. దీంతో దర్శకుడు కబీర్ ఖాన్ కు చేధు అనుభవం ఎదురుకావాల్సి వచ్చింది.
అసలు కబీర్ ఖాన్ రూపోందించిన చిత్రం భజరంగీ భాయ్ జాన్ ను పాకిస్థాన్ లో విడుదల కానీయకుండా లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది. కరాచీ ఎయిర్ పోర్టులో కబీర్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని మరో దర్శకుడు మధు భండార్కర్ ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కాగా ఈ చిత్రాన్ని చూటడంపై నిషేదం వున్నా.. అందోళనకారులు ఎలా చూశారని, చిత్రం రూపోందించిన నేపథ్యం వారికేం తెలుసునని మదు భండార్కర్ ప్రశ్నించారు. దర్శకులు ప్రతిభను కొనియాడాల్సింది పోయి ఈ విధంగా అడ్డుకుంటారా..? ఇదేం పద్దతని ఆయన నిలదీశారు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more