Jaya Invokes Dharma, Seeks a Massive Mandate in RK Nagar

Power cut in jayalalitha election campaign in rk nagar

power cut, Jayalalithaa, tamilnadu election campaign, rk nagar, Election Commission, Tamil Nadu

AIADMK General Secretary and Tamil Nadu CM Jayalalithaa launched her election campaign in R K Nagar Assembly constituency in the city

ఎన్నికల ప్రచారంలో ‘అమ్మ’కు కోపం వచ్చింది..

Posted: 05/08/2016 09:42 AM IST
Power cut in jayalalitha election campaign in rk nagar

రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యం అని ప్రసంగాలను వల్లె వేసిన నేతలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అసలా నరకం ఎలా వుంటుందో అనుభవానికి వచ్చింది. రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేవు అని, సంపూర్ణ విద్యుత్ అందుతున్నదని, త్వరలో మిగులు విద్యుత్‌ను చూడబోతున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదే పదే ఎన్నికల ప్రచారంలో తన ప్రచారాస్త్రంగా నినదిస్తున్నారు. కాగా అమె సోంత నియోజకవర్గం అర్కే నగర్ లో విద్యుత్ కోత ఎలావుంటుందన్న విషయాన్ని మాత్రం అధికారులు అమెకు రుచి చూపించారు.

ఆర్కేనగర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్న అమ్మ జయలలిత తన సొంత నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలతో దూసుకెళ్లారు. అప్పుడప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అ సమయంలో అమ్మ సున్నాం కాలువ నుంచి మనలి రోడ్డు వైపుగా వచ్చింది. అంతే అక్కడ యధావిధిగా విద్యుత్ కోత విధించారు అధికారులు. వీధి దీపాలన్నీ వెలగకపోవడంతో చిమ్మ చీకటి తప్పలేదు. దీంతో అమ్మకు కోపం వచ్చిందో ఏమో, కాన్వాయ్ రయ్యి మంటూ ముందుకు దూసుకెళ్లినట్టు అక్కడి వాళ్లు పేర్కొంటున్నారు.

నిత్యం ఇక్కడ ఆరున్నర - ఏడున్నర గంటల మధ్యలో పవర్ కట్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో దారి దోపిడీలూ కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అమ్మ రాకతో ఈ రోడ్డుకు కొత్త మెరుగులు దిద్దిన అధికారులు పవర్ కట్ సమస్యను మరిచినట్టున్నారు.  అయితే, ఈ పవర్ కట్ సమస్య అధికారుల్ని వణికిస్తున్నాదట. ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న అధికారులందరిపై అమ్మ కన్నెర్ర చేస్తారో అన్న భయంలో వారు జారుకున్నారట

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power cut  Jayalalithaa  tamilnadu election campaign  rk nagar  Election Commission  Tamil Nadu  

Other Articles