Germania plane lands in a rainbow during strong winds

Germanair plane makes crosswind landing in a rainbow

astonishing video, Plane spotter Martin Bogdan, aircraft landing in front of a rainbow, Dusseldorf Airport, western Germany, Cargospotter, Germania Airbus A321, Delta Boeing 767, Astonishing moment, passenger jet, RAINBOW, German, Martin Bogdan

The astonishing video clip, captured on camera by a plane spotter, shows the aircraft landing in front of a rainbow at Dusseldorf Airport, in western Germany, after rain fell on the region.

ITEMVIDEOS:అద్భుత దృశ్యం: ప్రతికూల వాతావరణంలో.. ఇంద్రధనస్సును చీల్చుకుంటూ..

Posted: 05/11/2016 01:45 PM IST
Germanair plane makes crosswind landing in a rainbow

జర్మనీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రంగురంగుల హరివిల్లు.. అదేనండీ ఇంద్రధనస్సును చీల్చికుంటూ మరీ ల్యాండింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. సాధరణ పరిస్థితులు ఉన్నప్పుడు సురక్షితంగా విమానయానం చేసి తిరిగి తనవాళ్లను కలవడమే అదృష్టంగా మారిన నేటి రోజుల్లో.. అసాధరణ పరిస్థితులు.. అందులోనూ ప్రతికూల వాతావరణంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవడం అద్భుతమే. అయితే ఇందులో అద్భుతమేముందని అనుకునే వారి సంఖ్య కూడా పెద్దగా లేకపోలేదు.

పైలెట్ శిక్షణలో వుండగా ప్రతికూల వాతావరణంలో విమానాన్ని ఎలా ల్యాండింగ్ చేయాలన్న అంశంలో కూడా తర్పీదునిస్తారని అనే వాళ్లు లేకపోలేదు. విషయంలోకి వస్తే..ఏకంగా భీకర గాలుల ఓ వైపు వీస్తున్నా.. వాటి మధ్య ఓ పైలెట్ విమానాన్ని సురక్షితంగా దించాడు. ఆ గాలి కూడా ఎంత వేగంగా ఉందంటే విమానాన్ని కూడా అమాంతం విసిరేసేంతగా. ఇందులో అసలైన మరో అద్భుతం ఏంటంటే అదే సమయంలో విరిసిన రెయిన్ బో చివరి అంచుమీదుగా చీల్చుకుంటూ పైలెట్ విమానాన్ని దించడం.

జర్మనీలోని డసెల్ డార్ఫ్ ఎయిర్ పోర్ట్ లో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పటికే ఆ ప్రాంతంలో తుఫాను వచ్చి వెళ్లిపోయింది. కానీ, బలమైన గాలులు భీకరంగా వీస్తున్నాయి. అదే సమయంలో ప్రయాణీకులతో వచ్చిన జర్మనీ ప్యాసెంజర్ జెట్ విమానం సరిగ్గా రెయిన్ బో చివరి అంచున ఆగింది. అనంతరం దాన్ని చీల్చుకుంటూ రన్ వేపై ముందుకు వెళ్లింది. అత్యంత అరుదుగా కనిపించే ఇలాంటి దృశ్యం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత సుందర దృశ్యాన్ని కార్గోస్పాటర్ పేరుతో వున్న సోషల్ మీడియా యుట్యూబ్ వినియోగదారుడు దీనిని తన సెల్ ఫోన్ బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడీ వీడియోను చూసేందుకు నెట్ జనులు అసక్తి కనబరుస్తున్నారు. మరెందుకు అలస్యం మీరూ ఈ వీడియోను చూడండీ..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Astonishing moment  passenger jet  RAINBOW  German  Martin Bogdan  

Other Articles