మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్ | Polling started in three states

Polling started in three states

Polls, tamilnadu, Kerala, Puducherry, elections, ఎన్నికలు, పోలింగ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి

Tamil Nadu is all set to vote for a new assembly along with neighbouring Puducherry and Kerala, the polling for which will begin at 7am on Monday. However, reports of large scale distribution of cash for votes from different parts of the state have cast a shadow on the polls.

మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

Posted: 05/16/2016 07:28 AM IST
Polling started in three states

తమినాడుతో సహా చాలా చోట్ల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. దక్షిణాది రాష్ర్టలు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మూడు రాష్ర్టల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా, అరవకురిచిలో వాయిదా పడినందున 233 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. కేరళలో 140 నియోజకవర్గాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

తమిళనాట ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని ఏఐఏడిఎంకె తమ సంక్షేమ పథకాలతో చాలా ధీమాగా ఉంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని డిఎంకె, కాంగ్రెస్ కూటమి తంటాలు పడుతోంది. ఇక కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్, సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్ డీ ఎఫ్ నువ్వానేనా అంటూ పోటా పోటీగా సాగుతున్నాయి.మే 16న పోలింగ్. మే 19న ఫలితాలు. ఈ ఫలితాలతో పాటు పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా 19నే ప్రకటిస్తారు. తమిళనాట డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీలకు విజయకాంత్ ఆధ్వర్యంలోని కూటమి ఎంతవరకూ పోటీ ఇస్తుంది. డిఎంకె పార్టీ విజయావకాశాలను ఏమేరకు దెబ్బతీస్తుందన్నదే ఆసక్తి కరమైన విషయం. ఇక కేరళ, తమిళనాడులో బీజేపీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందా అన్నది అనుమానమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles