temples | church | mosque | gurudwara | spirutual service centres | women | longer life

Going to spirutual service centres leads to longer life

temples, church, mosque, gurudwara, spirutual service centres, women, longer life, Spiritual service centers, Women, cancer, heart stoke, Researcher Tyler Jay vandarvil, stay grounded, spiritual guidance, religious services

A new study suggests that regular attendance to spirutual service centres may also help increase their lifespan.

అలా చేస్తే దీర్ఘాయువే కాదు.. రోగాలు కూడా దరిచేరవట

Posted: 05/18/2016 11:14 AM IST
Going to spirutual service centres leads to longer life

ఆలయాలకు వెళ్లే భక్తులు ఆక్కడున్నంత సేపు దైవ చింతనలో గడుపుతారని, దీంతో వారు ఏకాగ్రతా శక్తి, మనస్సుకు నిర్మలత్వం కలుగుతాయని ఇప్పటికే అనేక మంది అద్యాత్మిక వేత్తలు చెప్పారు. అయితే మందిరాలకే కాదు, మసీదులు, చర్చులు తదితర ఆధ్యాత్మిక సేవా కేంద్రాలకు వెళ్లే వారికి దీర్ఘాయువుతో వుంటారట. వారానికి ఒకటి అంతకన్నా ఎక్కువ సార్లు ప్రార్థాన మందిరాలకు వెళ్లే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారట! ఈ మేరకు తాజాగా నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది.

వారానికి ఒకటి లేక అంతకన్నా అధికంగా ప్రార్థనా మందిరాలకు వెల్లే మహిళలకు  గుండె, కేన్సర్ తదితర రోగాలు కూడా దరి చేరవవని అధ్యయనంలో తేల్చింది. అంతేకాకుండా మత సంబంధిత కేంద్రాలకు వెళ్లని మహిళలతో పోలిస్తే వెళ్లే మహిళల్లో 33 శాతం మరణాలు తక్కువగా సంభవిస్తున్నట్లు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పరిశోధకుడు టైలర్ జే వాండర్‌వీల్ తెలిపారు. ఈ మేరకు సుమారుగా 75 వేల మంది నర్సుల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగోన్నామని తెలిపారు.

ప్రతి నాలుగేళ్లను ఓ పర్యాయంగా తీసుకుని 1992 నుంచి 2012 వరకు వీరిపై అద్యయనం చేశామని చెప్పారు. అయితే ప్రార్థాన మందిరాలకు వెళ్లడంతో పాటు వారి జీవితాల్లోని ఇతర అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుని అధ్యయనం చేశామన్నారు. అయితే వారానికి ఒక పర్యాయం మందిరాలకు వెళ్లే వారికి దీర్ఘయువుతో పాటు కేన్సర్, రక్తపోటు సహా పలు వ్యాధులకు కూడా దరి చేరవని తమ అధ్యయనంలో వెల్లడైందని చాన్ తెలిపారు, కాగా, ఈ అధ్యయనం కేవలం మధ్య వయసు, వృద్ధాప్య మహిళపై మాత్రమే నిర్వహించడం గమనార్హం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles