355 Calls Between Arms Dealer And Aviation Minister's Aide, Documents Show

Ministers osd dragged into row involving arms bhandari

arms dealer Sanjay Bhandari,Bhandari notice,IAS AKK AKK,Aviation Minister Ashok, Ashok Gajapathi Raju, Special Duty Appa,Robert Vadra,private TV channel,Gajapathi Raju,New Delhi,investigative agencies

A top aide to Civil Aviation Minister Ashok Gajapathi Raju was today dragged into the controversy involving arms dealer Sanjay Bhandari, with allegation that he made 355 calls to the official.

ఇరుకున పడ్డ కేంద్రమంత్రి.. బంఢారీతో ఓఎస్టీకి సంబంధాలు

Posted: 06/02/2016 09:32 AM IST
Ministers osd dragged into row involving arms bhandari

ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు బినామీగా చెలమాణి అవుతూ ఆయన తరపున లండన్ లో ఓ ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. భండారీ కేంద్రంలోని పెద్దలతో కూడా సంబంధాలు కలిగివున్నట్లు తాజాగా స్పష్టమైంది. కేంద్ర విమానయాన మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అప్పారావు ఫోన్‌కాల్స్‌పై ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చకు తెరలేసింది.

భండారీ ఇంట్లో విచారణ సంస్థల సోదాల్లో దొరికిన ఆధారాల్లో.. గతేడాదిగా అప్పారావుతో కనీసం రోజుకోకసారి చోప్పున 355 సార్లు భండారీ మాట్లాడినట్లు వెల్లడైంది. అయితే ఏడాదిలో 355 సార్లు ఫోన్ చేసినా అది తక్కువ సార్లు ఫోన్ చేసినట్లేనని, అందువల్లే తాను ఆ నెంబరును గుర్తుపెట్టుకోలేదని కేంద్రమంత్రి గారి ఓఎస్డీ వివరణ ఇవ్వడం గమనార్హం. కాగా, మంత్రిని కలిసేందుకు భండారీ ఏడాదిన్నర కాలంలో మూడు, నాలుగు సార్లు ఇంటికొచ్చారని కూడా ఆయన వివరించారు.

అయితే విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్నందుకే మంత్రి ఈయనతో మాట్లాడారాన్నారు. ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్‌షోలో అశోక్ గజపతి రాజును భండారీ కలిసినట్లు వెల్లడించారు. కాగా, భండారీతో తనకు వ్యక్తిగత పరిచయమే తప్ప వృత్తిపరమైన సంబంధాల్లేవని బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 2009లో వాద్రాకు చెందిన లండన్ ఇంటిని భండారీ కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. కాగా, బ్యాంకు అకౌంట్లు, ఆస్తులకు సంబంధించిన వివరాలివ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) భండారీకి నోటీసులు  జారీ చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles