బాంబే రక్తం బార్డర్ దాటిపోతుంది | bombay blood group travels to bangladesh to save a life

Bombay blood group travels to bangladesh to save a life

bombay blood group, Bangladeshi youth bombay blood group, Mohammed Kamruzzaman bombay blood group, బంగ్లాయువకుడి కోసం బాంబే బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ బంగ్లాదేశ్, భారత్ బంగ్లా బాంబే బ్లడ్ గ్రూప్, మహ్మద్ కమ్రుజ్జమన్, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news

bombay blood group travels from India (Mumbai) to bangladesh to save a life. On Saturday, four units of the rare Bombay blood group will be flown across the border to save the life of a Bangladeshi youth waiting to undergo a life-saving surgery in Dhaka. Four Mumbaikars have come to the rescue of accident victim Mohammed Kamruzzaman who needs the blood for an urgent surgery to treat multiple fractures.

బాంబే రక్తం బార్డర్ దాటిపోతుంది

Posted: 06/18/2016 09:44 AM IST
Bombay blood group travels to bangladesh to save a life

గోపీచంద్ ఒకడున్నాడు సినిమా గుర్తుందా? అందులో విలన్ మహేష్ మంజ్రేకర్ కి గుండె సమస్య ఉంటుంది. బాంబే గ్రూప్ అనే ఒక ప్రత్యేకమైన రక్తం ఉన్న వ్యక్తుల గుండెను అమరిస్తేనే బతుకుతాడని చెప్పటంతో హీరో గోపీచంద్ వెంటపడతాడు. అయితే ఆ బ్లడ్ కాన్సెప్ట్ అంతా కల్పితం కాదు. నిజంగానే అలాంటి ఓ రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది. ఇండియాలో అది కూడా కేవలం 400 మంది లోపు మాత్రమే ఈ గ్రూపుకు సంబంధించిన వారు ఉన్నారంట. ఆ మధ్య గుంటూరు లో కూడా ఈ గ్రూప్ ఉన్న వ్యక్తిని చూశాం కూడా. ఇప్పుడు అదంతా ఎందుకంటే... ప్రస్తుతం పొరుగున ఆ రక్తం కోసం ఓ ప్రాణం కొట్టుమిట్టాడుతుంది.  

ఢాకాకు చెందిన 25 ఏళ్ల మహ్మద్ కమ్రుజ్జమన్ అనే యువకుడు గత నెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు చేతులతో పాటు పెల్విస్ (కటి వలయం) విరిగిపోయింది. అతడు ప్రాణాలతో బతికి బట్టకట్టాలంటే ఆపరేషన్ చేయాలని, అది కూడా వీలైనంత త్వరగా చేయాలని అక్కడి అపోలో వైద్యులు చెప్పారు. అయితే, అతడిది ఏ గ్రూపో తెలుసుకుందామనుకున్న పరీక్ష చేసిన వైద్యులు షాక్ కి గురయ్యారు. కమ్రుజమన్ ది అరుదైన 'బాంబే బ్లడ్ గ్రూప్', అది అంత తేలిగ్గా దొరకడం దాదాపు అసాధ్యం. బంగ్లాదేశ్ మొత్తం గాలించినా ఆ గ్రూప్ రక్తం దొరకలేదు, సరికదా, అసలు కొన్ని బ్లడ్ బ్యాంకులకు దానిపట్ల అసలు అవగాహనే లేదు. అతని సోదరిదీ అదే గ్రూప్ అని తేలినా,  ఆమె రక్తదానానికి పనికిరాలేదు. దీంతో ఆన్ లైన్లో శోధించడం మొదలుపెట్టారు. ఇండియాలో ఈ గ్రూప్ వారు ఉన్నారని తెలుసుకున్నప్పటికీ, వారిలో కూడా దానం చేసే వారు అతితక్కువ మంది వున్నారని తెలిసింది.

దీంతో ముంబైకి చెందిన ఎన్జీవో ‘థింక్ ఫౌండేషన్’ నిర్వాహకుడు వినయ్ శెట్టికి తమ గోడు వినిపించారు. ఆయన సహకారంతో ముంబైకి చెందిన స్వప్న సావంత్, కృష్ణానంద్ కోరి, బెహుల్ భెలీకర్, ప్రవీణ్ షిండే నుంచి నాలుగు యూనిట్ల బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం సేకరించారు. ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాక్సులో ఐస్ జెల్ ప్యాక్స్ నడుమ రక్తాన్ని ఢాకాకు తరలించనున్నారు. రక్తం ఢాకా చేరుకున్న వెంటనే బాధితుడికి శస్త్రచికిత్స చేయనున్నారు.

దీనిని తీసుకెళ్లేందుకు కమ్రుజ్జమన్ స్నేహితుడు ఎస్కే తుహినుర్ ఆలం గురువారం ముంబై చేరుకున్నాడు. ఈ రక్తంతో తన స్నేహితుడు బతుకుతాడన్న నమ్మకం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. వారిచ్చింది నాలుగు యూనిట్ల రక్తం మాత్రమే కాదని, తన స్నేహితుడిపైనే ఆధారపడి ఉన్న ఆయన కుటుంబ సభ్యుల జీవితం అని చెమర్చిన కళ్లతో చెబుతున్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bombay blood group  Bangladeshi youth  Mohammed Kamruzzaman  

Other Articles