Model ran sex racket under guise of production house

Model arrested for allegedly running prostitution ring

mumbai, prostitution ring, mumbai prostitution ring, prostitution ring in mumbai, Mumbai Crime, sex racket, prostitution racket, sex racket busted, prostitution racket busted, Mumbai model arrested, Rekha Vaishnav, production house, nude shots, flesh trade, VR Entertainment, Versova, New MHADA Society, Lokhandwala Circle, Mumba

A 24-year-old model was arrested for allegedly running a prostitution racket in Versova of western Mumbai under the guise of a production house and two girls were rescued.

లోగుట్టు రట్టు.. మోడల్ అరెస్టు..!

Posted: 06/27/2016 11:03 AM IST
Model arrested for allegedly running prostitution ring

పైన పటారం.. లోన లోటారం.. అన్న నానుడి మనకు తెలిసిందే. సరిగ్గా అలాగే పైన బోర్డులో ఒక పేరు పెట్టి..లోన మాత్రం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వుంది. అనేక మంది సంఘవ్యతిరేకులను  పోలీసులు కటకటాలోకి నెడుతున్నా.. ఆ మార్గంలో నడుస్తున్నవారిలో మాత్రం మార్పు రావడంలేదు. ఇప్పటికే మసాజ్ సెంటర్ల పేరుతో నడుపుతున్న వ్యభిచార కేంద్రాలపై దాడులు నిర్వహిస్తూనే అనేక మంది నిర్వాహకులను జైలుకు తరలించిన పోలీసులు సవాలు విసిరేలా నేరస్థులు తయారవుతున్నారు.

మోడలింగ్ లో రాణించాలంటే తమ ప్రోడక్షన్ హౌజ్ లో చేరాలని ప్రకటనలు గుప్పించి.. అందమైన అమ్మాయిలను అకర్షించి.. ప్రముఖ మోడళ్లుగా తీర్చిదిద్దుతామని నమ్మించి.. వారి వ్యభిచారిణులగా మార్చే ఓ సంస్థపై పోలీసులు అకస్మికంగా దాడులు జరిపారు. మోడలింగ్ కేంద్రం మాటున జరుగుతున్న లోగుట్టును బట్టభయలు చేసిన పోలీసులు నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై పోలీసులు నిన్న నగరంలోని వెర్సోరా ప్రాంతంలో రేఖా వైష్ణవ్ అనే 24 ఏళ్ల మోడల్ ను అరెస్ట్ చేశారు.

మోడలింగ్ తో పాటు సినీ వినీలాకాశంలో మెరిసిపోదామంటూ వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న అమాయక యువతుల బలహీనతలనే లక్ష్యంగా చేసుకున్న ఆ మోడల్... ఏకంగా వ్యభిచార కూపాన్నే నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆ లేడీ మోడల్ విఆర్ ఎంటర్టైన్మంట్ పేరుతో ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా తెరచిందట. గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయిలతో న్యూడ్ ఫోటో షూట్ లు చేయించి వాటిని..వాట్సాఫ్ లో విటులకు పంపింది. విటుల నుంచి భారీగా డబ్బును ముందే లాగింది. అయితే ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ మోడల్ నిర్వహిస్తున్న చీకటి వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న ఆమె కార్యాలయంపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఇద్దరు మైనర్ బాలికలను వారు వ్యభిచార కూపం నుంచి రక్షించారు. ఆ తర్వాత మోడల్ ను అరెస్ట్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sex racket  prostitution racket  Rekha Vaishnav  production house  nude shots  mumbai  mumbai crime  

Other Articles