isis-sympathisers-id-proofs-recoverd-by-nia-officials

Isis sympathisers targets both telugu states

Islamic State, ISIS terrorists, isis sympathisers, Hyderabad, Anantapur, national investigation agency. nia, isis id proofs, nandi residency isis,

After Hyderabad, isis sympathisers even targeted anathapur, as per their disclosure in custody nia conducted raids in anantapur and recovered id cards.

సానుభూతిపరుల తీగలాగితే.. ఐసిస్ డొంక కదులుతుంది..

Posted: 07/06/2016 07:01 PM IST
Isis sympathisers targets both telugu states

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అటు ఆంధ్రప్రదేశ్ ను కూడా టార్గెట్ చేశారా..? అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని అనంతపురంను కూడా టార్గెట్ చేశారని సమాచారం. గతవారం హైదరాబాద్ లో కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు బృందం అధికారులు ఆతరువాత ఇరు రాష్ట్రాల పోలీసులు, భద్రతా అధికారులు మరింత అప్రమత్తం చేశారు. ఐసిస్ ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాలలో విస్తరించుకున్నారన్న వ్యూహాలను భగ్నం చేశారు.

తమ అదుపులో వున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సానుభూతి పరులను విచారిస్తున్న క్రమంలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సానుభూతిపరుల నుంచి తీగ లాగుతుంటే హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలో వారు పన్నిన కుట్రలు, కుతంత్రాల డొంక కదులుతుంది. తాజాగా సానుభూతిపరుల నుంచి రాబట్టిన సమాచారంతో ఎన్ ఐ ఎ అధికారులు అనంతపురంలో దాడులు నిర్వహించారు. అనంతపురం సహా అంధ్రప్రదేశ్ లో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ అదికారులు దర్యాప్తు చేపట్టింది.

బస్టాండ్ సమీపంలోని నంది రెసిడెన్సిలో సోదాలు నిర్వహించి లాడ్జి నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో అరెస్టయిన ఐసిస్ సానుభూతిపరులను అనంతపురం పట్టణానికి తీసుకొచ్చి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తుపాకీ కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు ఇక్కడికి వచ్చారని వివరించారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులను జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA investigation  ISIS Sympathisers  nandi residency  id proofs  

Other Articles