ఎందుకురా నా కూతురిని చిదిమేశావ్... | techie swathi murdered identification parade completed

Techie swathi murdered identification parade completed

techie swathi murderer ram kumar, ram kumar identification parade, techie Swathi father Santhanagopalan

techie swathi murderer ram kumar identification parade completed. Swathi father Santhanagopalan lost control over his emotions and broke down at parade.

ఎందుకురా నా కూతురిని చిదిమేశావ్...

Posted: 07/13/2016 11:30 AM IST
Techie swathi murdered identification parade completed

మంగళవారం తమిళనాడులోని పుజల్ జైలు. టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుల ఐడెంటిఫికేషన్ పెరేడ్ జరుగుతోంది. ఆమె తండ్రి శంతన గోపాలకృష్ణన్‌ ద్వారా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అప్పటికే రెండు రౌండ్లు పూర్తయి మూడో రౌండ్ కొనసాగుతుంది. అంతలో ఎడమ నుంచి నాలుగో వ్యక్తిని చూసిన ఆయన ఆవేశం అదుపు చేసుకోలేకపోయారు. వీడే ఆ రాక్షసుడు అంటూ వెంటనే కాలర్ పట్టుకుని ‘‘ఎందుకురా నా కూతురిని చిదిమేశావ్’’.. అంటూ రోదించసాగాడు.

టెక్కీ స్వాతి ఫేస్ బుక్ ప్రేమాయణం?

చెన్నైలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను బాధితురాలి తండ్రి గుర్తించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.  తన కుమార్తె స్వాతి ఒకసారి రామ్‌కుమార్‌ను తనకు చూపించిందని దర్యాప్తు సమయంలో చెప్పడంతో గోపాల్‌కృష్ణన్‌ను సాక్షిగా పరిగణించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముందుగా స్వాతి తండ్రి తో గుర్తింపు ప్రకియ జరిపిన అధికారులు ఆపై రెండో సాక్షి, నుంగంబాకం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై పుస్తకాలు విక్రయించే వ్యక్తిని పిలిపించారు. వరుసలో నిల్చున్న తొమ్మిదో వ్యక్తే స్వాతిని చంపాడని అతను చెప్పాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీశారు.

టెక్కీ స్వాతి హంతకుడు రామ్ కథేంటి?

ఇక పరేడ్‌లో నిందితుడితోపాటు అదే వయసున్న మరో తొమ్మిది మందిని పోలీసులు నిలబెట్టారు. రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో గొంతు కోసుకోవడంతో ఆస్పత్రిలో అతనికి చికిత్స చేసి మెడకు బ్యాండేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పరేడ్‌లో నిల్చున్న అందరి మెడలకు కూడా బ్యాండేజి వేయించటంతోపాటు వారి చేత ఎర్ర చోక్కాలు ధరింపజేయించారు.  చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శంకర్ సమక్షంలో పోలీసులు నిందితుడి పరేడ్ నిర్వహించారు. సాక్షులు రామ్‌కుమార్‌ను గుర్తుపట్టడంతో రికార్డు చేసిన వీడియోను ఎగ్మోర్‌లోని 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు అందించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : techie swathi  infosys  murder  ram kumar  identification parade  Santhanagopalan  

Other Articles