సోషల్ మీడియా పరిచయాలు మోసాలకు ఎంత కారణంగా అవుతున్నాయో, ఒకటో, రెండో జీవితాలు సెటిల్ అయిపోవటానికి కూడా అంతే కారణం అవుతున్నాయి. ముఖాలు చూసుకోకుండానే ప్రేమించేసుకోవటం, ఆపై పెద్దల అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి ఓ ఉదంతం మొదటికే మోసం తెచ్చిన ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది.
17 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. ఆపై అభిరుచులు, మాటలు కలియటంతో పెద్దలను ఒప్పించి గతేడాది సెప్టెంబర్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. పది నెలల చక్కగా కాపురం చేసిన ఈ జంటలో అనుకోని కలతలు వచ్చాయి. ఏమైందో తెలీదు గానీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ అబ్బాయి తనకు ఇష్టం లేకుండా ఒలవంతంగా ఆ యువతినిచ్చి పెళ్లి చేశారంటూ బాల్య వివాహ చట్టం ప్రకారం కేసు పెట్టాడు. దీంతో ముందు షాక్ తిన్న యువతి ఆపై తెలివిని ప్రదర్శించింది.
తనను ఆ యువకుడు రేప్ చేశాడని, అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, కాబట్టి అతనిపై లైంగిక దాడి కేసు నమోదు చేయండంటూ ఎదురు ఫిర్యాదు చేసింది. దీంతో తలలు పట్టుకున్న పోలీసులు పెద్దలను పిలిచి అసలు విషయం ఆరాతీశారు. రెండో పెళ్లి చేసుకోమ్మని ఓ బంధువు ఇచ్చిన సలహా మేరకు ఆ యువకుడు కేసు, గీసు అంటూ డ్రామాకు తెరలేపాడని అర్థం చేసుకున్నారు.
పెద్దల అంగీకారంతోనే వారి వివాహం జరిగిందని నిర్థారణకు వచ్చిన పోలీసులు ఓ వార్నింగ్ ఇచ్చి ఆ జంటను వదిలేశారు. అయితే మైనర్లు అని కూడా చూడకుండా పళ్లు ఇగిలిస్తూ వారిద్దిరికీ వివాహం చేసిన పెద్దలపై మాత్రం కేసు నమోదుచేస్తున్నట్లు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఇంకోవైపు ఆ యువతితో ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండలేనని ఆ యువకుడు చైల్డ్ ఫోరంను ఆశ్రయించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more