Mumbai shame: Minor girl abducted, gang-raped for four days

16 year old girl abducted repeatedly gnagraped in mumbai

rape, gangrape, mimbai, 16 yr old girl, minor girl, deepak mishra, Nalasopara station, molest, repeated rape, minor girl sexual assault, Jawaharnagar Samaj Sevak Sanstha, molestation, sexual harrasment, sexual assult, crime

Once-safe-for-girls Mumbai is no more any same for its girls. A 16-year-old student of class 10th has claimed that she was abducted and raped for four days by two youths.

మైనర్ బాలిక కిడ్నాప్.. నాలుగు రోజుల పాటు గ్యాంగ్ రేప్...

Posted: 07/22/2016 11:09 AM IST
16 year old girl abducted repeatedly gnagraped in mumbai

ఒకనాడు అడపడచుల భద్రతకు అలావాలమైన దేశ ఆర్థిక రాజధాని ముంబై.. తాజాగా అత్యధిక సంఖ్యలో అబలలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతూ గత ఏడాది కేంద్రం విడుదల చేసిన నేరపూరిత నగరాలలో అగ్రస్థానంలో నిలబడి ప్రతిష్మాత్మక నగర పరువును తీసుకుంది. ప్రస్తుతం ముంబై నగరం కూడా బాలికలకు సురక్షితం కాదని తాజాగా జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనతో తేలింది. రైలు మిస్ కావడంతో ఇంటికి వద్ద దిగబెడతామని నమ్మబలకి పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక ను అపహరించిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.

ముంబైలోని రైల్వే స్టేషన్ నుంచి తమ ఇంటికి వెళ్లేందుకు ప్రతి రోజు మాదిరిగానే రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయితే అనుకోకుండా బాలిక ఒక రోజు రైలు మిస్ అయ్యింది. అమెను గత కొద్ది రోజులుగా ఫాలో అవుతున్న దీపక్ మిశ్రాకు ఇదే అవకాశాన్ని వాడుకున్నాడు. ఇంటికి నడుచుకుంటూ బయల్దేరిన బాలికను మార్గమధ్యంలో అపహరించాడు. ముందుగా నగరంలోని ఓ లాడ్జీకి తీసుకువెళ్లి అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తరువాత అతని స్నేహితుడికి ఫోన్ చేసి.. అతని ఇంటికి తీసుకెళ్లాడు.

స్నేహితుడి ఇంట్లో బాలికను బంధించి నాలుగు రోజుల పాటు దీపక్ మిశ్రా, అతని స్నేహితుడితో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన యువకులు అమెను వదిలిపెట్టారు. ఇంటికి చేరికున్న బాధిత బాలిక కుటుంబసభ్యులతో తనకు జరిగిన అఘాయిత్యాన్ని తెలుపింది.  తండ్రితో కలిసి పోలీసుస్టేషనుకు వచ్చిన బాధితురాలు పోలీసులకు అపహరణ, అత్యాచారంపై ఫిర్యాదు చేశారు.

సామూహిక అత్యాచారం ఘటనపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రాథమికంగా కేసును నమోదు చేయకపోగా, బాధితురాలిని విచారణ పేరుతో ప్రశ్నలతో వేధించారు. తమకు జరిగిన అన్యాయంపై పిర్యాదు చేయడానికి వస్తే పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన.. బాధితురాలని అస్పత్రికి పంపి వైద్య చికిత్సలు అందించేందుకు బదులు వేధించారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ సమాజ్ సేవక్ సంస్థ సభ్యులు రంగంలోకి దిగి అత్యాచారానికి గురైన బాలికను న్యాయసహాయం అందించారు.ఈ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ మిశ్రాను పోలీసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  mumbai 16 yr old girl  minor girl  crime  

Other Articles