వైద్య విద్య సహా దాని అనుబంధ కోర్సుల ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ కేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసింది షేక్ నిషాద్ అని నిర్థారించిన సిఐడీ అధికారులు అతడ్ని ముంబైలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం, ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి నిషాద్‌లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, లీకేజీతో జేఎన్టీయు ప్రొఫెసర్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ కుంభకోణంలో కనిగిరికి చెందిన రమేశ్ కూడా కీలకపాత్ర వహించినట్లు సీఐడీ అధికారులు విచారణలో కనిపెట్టారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన రమేశ్ అనంతరం కోచింగ్ సెంటర్ల వద్ద దళారీగా వ్యవహరించేవాడని తెలిసింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఇదిలావుంటే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ.50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30-40 లక్షల తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
మరోవైపు.. ఎంసెట్ పరీక్షను రద్దు చేసే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. సీఐడీ నివేదిక తర్వాత రద్దుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు.. ఇప్పటివరకు 3 పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎంసెట్-2 లీకేజీ కారణంగా మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరో కొందరు చేసిన లీకేజీ పాపానికి తాము బలి అవుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష రాస్తే మంచి ర్యాంకు వస్తుందో రాదోనని మధనపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more