బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తెలంగాణ | Telangana aims to become first open defecation free state by 2017

Telangana aims to become first open defecation free state by 2017

KTR on defecation free state, Telanagana open defecation free state, Telangana open defecation free state, IT minister KTR about defecation free, new target for telangana, Telangana govt opt modi slogan

Telangana aims to become first open defecation free state by 2017.

కేసీఆర్ కొత్త టార్గెట్ బాగానే ఉంది, కానీ...

Posted: 08/05/2016 11:46 AM IST
Telangana aims to become first open defecation free state by 2017

తెలంగాణ ప్రభుత్వం మరో టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. వచ్చే ఏడాది నాటికి పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఐదంచెల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. మార్చి 31, 2017 నాటికి వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది.

మొదటి విడతలో భాగంగా మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికార యంత్రాగం తొలుత 15 మునిసిపాలిటీలను ఎంచుకుని పూర్తిస్థాయిలో టాయిలెట్లు నిర్మించడంపై దృష్టిసారించనుంది. అక్కడ లక్ష్యాన్ని చేరుకున్న అనంతరం మిగతా 42 మునిసిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. రెండో విడతలో భాగంగా 20 మునిసిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఈనెల 15 నాటికి పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించనున్నారు. మరో 11 మునిసిపాలిటీలకు అక్టోబరు 2 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు.

26 మునిసిపాలిటీలకు వచ్చే ఏడాది జనవరి 26, మిగిలిన ఆరింటికి మార్చి 31, 2017 వరకు గడువు ఇచ్చి ఆ లోగా టాయిలెట్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్‌లో జరిగిన ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లోనే ప్రకటన చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు దానిని మరో ఏడాది పొడిగించారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం రాష్ట్ర మూడో ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని వందశాతం టాయిలెట్లు కలిగిన రాష్ట్రంగా ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

అయితే ఇప్పటిదాకా అన్ని పథకాల్లోనూ ఆలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులు, ఈ విషయంలో ఏ మాత్రం కృతనిశ్చయంతో పని చేస్తారన్నదానిపై అప్పుడే అనుమానాలు మొదలౌతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  2017  Telangana  open defecation free  

Other Articles