షాద్ నగర్ కాల్పుల్లో నయీమ్ మృతి | Gangster Naeem Dead in Shadnagar Shootout

Gangster naeem dead in shadnagar shootout

Gangster Naeem, Gangster Naeem encounter, Naeem encounter in Shadnagar, Shadnagar Encounter, Gangster Naeem Crime history, Naeem Encounter

Gangster Naeem Dead in Shadnagar Shootout.

ITEMVIDEOS: టెర్రరిస్ట్ లు కాదు.. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్

Posted: 08/08/2016 11:48 AM IST
Gangster naeem dead in shadnagar shootout

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పులు ఉగ్రకాల్పులు కాదని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించింది మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ నయీమ్ అని ఆయన తెలిపారు. కొద్దిసేపటి క్రితం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసిన అనురాగ్ శర్మ... అందులో ఎన్ కౌంటర్ జరిగిన తీరును వెల్లడించారు. ఆదివారం రాత్రి 7 గంటలకే నయీమ్ తన అనుచరులతో కలిసి షాద్ నగర్ చేరుకున్నారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నయీమ్ బసపై పక్కా సమాచారం సేకరించిన తర్వాతే గ్రేహౌండ్స్ బలగాలు అతడి ఇంటిని చుట్టుముట్టాయన్నారు. తానుంటున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన విషయాన్ని పసిగట్టిన నయీమ్ అప్రమత్తయ్యాడని తెలిపారు. ఈ క్రమంలో నయీమ్ ఆదేశాలతో అతడి గన్ మన్ పోలీసుల పైకి కాల్పులు మొదలుపెట్టాడన్నారు. ఈ కాల్పుల నుంచి రక్షించుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు ఎదురు కాల్పులకు దిగాయని ఆయన తెలిపారు. ఈ కాల్పుల్లో నయీమ్ చనిపోయాడని డీజీపీ పేర్కొన్నారు.

నయీమ్ నేరచరిత్ర:
కాగా, నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నేర చరిత్ర చాలా పెద్దదే. ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలం రేపిన సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోదర్ధన్ రెడ్డి, మావోయిస్టు నేతలు సాంబశివుదు, రాములు హత్య కేసుల్లోనూ నయీమ్ కీలక నిందితుడు.గతంలో కొన్నాళ్లు కోవర్టు జీవితం గడిపిన నయీంకి పోలీసు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే అతని వేటను వారు లైట్ తీసుకునే వారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ టైంలో మావోయిస్టు అగ్రనేతలను చంపేందుకు పోలీసులు నయీంను పావుగా వాడుకునే వారన్న వాదన ఉంది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ పోలీసులతోపాటు సీబీఐ కూడా నయీం కోసం తీవ్రంగా గాలించింది. కానీ వారెవరికీ ‘పోలీసు ఆయుధం’ జాడ మచ్చుకైనా తెలియలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోచ్చు. ఇంకోవైపు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కొన్ని పెద్దతలలు అతని వెనకాల ఉన్నట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. 

భూదందాలు, సెటిల్ మెంట్లతో తనదైన శైలిలో కరడుగట్టిన నేరగాడిగా పేరుగాంచిన నయీమ్ పై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు అతడిని వేటాడేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బలగాలు షాద్ నగర్ లో అతడిని అంతమొందించాయి. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీమ్ పై 100కు పైగా కేసులు నమోదు అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster Naeem  Shadnagar  Telanagana  police  encounter  

Other Articles