it is good to eliminate nayeemuddin says former dgp dinesh reddy

Dgp level officers never deal with informers says dinesh reddy

gangster nayeemuddin, nayeem encounter, former dgp dinesh reddy, sit investigation, nayeem, ex dgp, dinesh reddy, press meet, hyderabad,

former dgp dinesh reddy says it i sgood to eliminate gangster nayeem and clarifies on allegatons that surrounded him by saying never a dgp level officer deal with informers.

‘నయీమ్’ నుంచి బీజేపి దూరం.. హోటల్‌లో దినేష్ రెడ్డి ప్రెస్ మీట్..

Posted: 08/13/2016 05:21 PM IST
Dgp level officers never deal with informers says dinesh reddy

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పార్టీకి ముడి పెట్టవద్దని మాజీ డీజీపీ దినేశ్ రెడ్డికి బీజేపి సూచించడంతో ఆయన ఉదయం నిర్వహిస్తానననుకున్న మీడియా సమావేశం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే వాయిదా మాత్రమే కాదు వేదిక కూడా మార్చారు. నయీంకు సంబంధాలున్నాయంటూ నయీం డైరీలో ఈ మేరకు రాసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాజీ డీజిపీ హోదాలో ప్రెస్ మీట్ నిర్వహించి నయీమ్ ను హతమార్చడం మంచిదేనని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చేస్తున్నానని అన్నారు

నయీం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. కోవర్టుగా మారిని మావోలతో ఏ డీజీపీ స్థాయి అధికారులకు కూడా సంబంధాలు వుండవన్నారు. సంచలనం కోసమే ఇలాంటి ప్రచారం జరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరానని, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన కొంత సున్నితమైన సమాచారాన్ని ఆయనకు అందిస్తానని చెప్పారు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటారని, అందులో తప్పులేదని తెలిపారు.

నయీం కేసులో ఉన్నవారందరినీ బయటకు తేవాలని దినేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో కలీముద్దీన్ అనే వ్యక్తి కోసం మాత్రం సీబీఐ వెతికినట్లు తనకు తెలుసని, అంతే తప్ప నయీముద్దీన్ కోసం ఎవరూ రాలేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayeem  ex dgp  dinesh reddy  press meet  hyderabad  

Other Articles