రియో ఒలంపిక్స్ లో సెమీస్ చేరిన పీవీ సింధు / PV Sindhu a win away from assuring India a medal in Rio Olympics

Pv sindhu a win away from assuring india a medal in rio olympics

PV Sindhu quarter final win in Rio Olympics, Hyderabadi Shuttler PV Sindhu, PV Sindhu in Rio Olympics, Sindhu beat Wang Yihan in olympics, Sindhu quarter final win, PV Sindhu medal in Rio Olympics, Hyderabadi sensational PV sindhu

Hyderabadi Shuttler PV Sindhu a win away from a medal in Rio Olympics.

ITEMVIDEOS: ఈ తెలుగమ్మాయి నిజంగా సంచలనమే!

Posted: 08/17/2016 11:53 AM IST
Pv sindhu a win away from assuring india a medal in rio olympics

కాకలు తిరిగిన క్రీడా యోధులు కూడా సాధించలేని పతకం ఫీట్ ను ఖాయం చేసుకుంది తెలుగు తేజం పీవీ సింధు. రియో ఒలింపిక్స్ లో సెమీస్ కు చేరటం ద్వారా పతకం కు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. గత రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ లో వరల్డ్ నెంబర్:2 షట్లర్ వాంగ్ ఇహాన్ ను వరుస సెట్లలో సింధు ఓడించిన తీరు యావత్తు భారతావనిని మంత్రముగ్ధులను చేసింది.
పతకం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కోట్లాది భారతీయుల కళలను నిజం చేసేందుకు మరింత చేరువైపోయింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్-2 క్రీడాకారిణి వాంగ్ యిహాన్‌ పై విజయం సాధించింది. రాత్రి జరిగిన హోరాహోరీ పోరులో 22-20, 21-19తో వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

సెమీస్‌లోనూ ఇదే ఆటతీరు కనబరిచి విజయం సాధిస్తే, స్వర్ణ లేదా రజత పతకం భారత్ ఖాతాకు చేరుతుంది. ఓడిపోతే మరో సెమీఫైనల్ పోటీలో ఓటమి చెందే క్రీడాకారిణితో సింధు కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఏదిఏమైనా రియో-2016లో మరొక్క గెలుపు పడితే చాలూ సింధు ఖాతాలోకి వస్తే పతకం ఖాయం. ఇక ఈ గెలుపుతో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. నాలుగేళ్ల క్రితం సైనా నెహ్వాల్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. జర్మనీ షట్లర్‌తో సింధు సెమీఫైనల్స్‌లో రేపు తలపడనుంది.

విజయంలో ఉద్వేగ క్షణాలుః

చివరి పాయింట్ కోసం సర్వీస్ చేసిన సింధు... వాంగ్ నుంచి తిరిగివచ్చిన కాక్ ను మళ్లీ వెనక్కు పంపింది. సదరు కాక్ ను మరోమారు సింధు కోర్టులోకి పంపేందుకు వాంగ్ తీవ్రంగా యత్నించింది. కాక్ ను ఒడిసిపట్టేసిన వాంగ్ దానిని బ్యాట్ తో సింధు కోర్టులోకి వేసేయబోయింది. వాంగ్ నుంచి తిరిగి వస్తుందనుకున్న కాక్ కోసం సింధు కూడా అప్రమత్తమైంది. కాక్ పడుతుందని భావించిన ప్రదేశానికి సింధు రానే వచ్చింది. కాక్ కింద పడకుండా చేసే యత్నంలో బ్యాటును ముందుకు సాచిన సింధు... పట్టుతప్పి పడిపోయింది.

అయితే వాంగ్ నుంచి వస్తుందనునుకున్న కాక్ మాత్రం నెట్ తాకి వాంగ్ కోర్టులోనే పడిపోయింది. సింధు గెలిచేసింది. కిందపడిన స్థితిలోనే విజయం సాధించానని తెలుసుకున్న సింధూ ఆదే స్థితిలోనే సింహనాదం చేస్తూ లేచింది. ఈ గెలుపు ఘడియలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం జాతీయ, లోకల్ మీడియాల్లో వైరల్ గా ప్రసారమవుతోంది.

ఈ క్షణం కోసం ఎనిమిదేళ్లు చూశాం...

ఎనిమిదేళ్ల క్రితం సింధు ఇంతటి స్థాయికి వస్తుందని ఊహించలేదని ఆమె తల్లిదండ్రులు రమణ, విజయలు సంతోషం వ్యక్తం చేశారు. పుల్లెల గోపీచంద్ దగ్గర ఆరితేరిన సిందు రోజూ 8 గంటలు కష్టపడేదని, ఏనాడూ ఆటలో ఇబ్బందుల గురించి ప్రస్తావించకుండా సర్దుకుపోయేదని వారంటున్నారు. అందరిలాగే తాము కూడా సింధు ఒలింపిక్స్ లో పతకం తేవాలనే కోరుకుంటున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  quarter final  Wang Yihan  won  semi final  

Other Articles