మళయాళంలో మూడేళ్ల క్రితం 'ఓరు ఇండియన్ ప్రనాయకథా' అనే ఓ సినిమా వచ్చింది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఆ సినిమాలో పాహద్ ఫాసిల్, అమలాపాల్ జంటగా నటించారు. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకంటారా? అందులో ఓ సన్నివేశం ఉంటుంది. ఓ ఆందోళన సందర్భంగా దానికి నేతృత్వం వహించిన హీరో అది కాస్త తేడా కొట్టడంతో హీరో పరుగులంఘించుకుంటాడు. పోలీస్ లాఠీ నుంచి తనను తాను రక్షించుకునేందుకు లుంగీ చేతబట్టి పరుగులు పెట్టి తప్పించుకుంటాడు. ఆ సినిమాలో ఆ కామెడీ సీన్ కు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు ఆ సోదంతా ఎందుకంటారా? ఏం లేదు అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు కేరళలో చోటుచేసుకోవటంతో ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తుంది.
వివరాల్లోకి వెళ్తే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీనికి ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నేత షరాఫుద్దీన్ నేతృత్వం వహిస్తున్నాడు. ఆయనగారు సోషల్ మీడియాలో ఓ చిన్న స్థాయి సెలబ్రిటీ కూడా. చట్టాన్ని గౌరవిస్తామని, హింస తమ విధానం కాదని, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని మీడియా ముందు కుండబద్దలు కొట్టాడు. ఇంతలో కార్యాలయం వెనుకగేటు నుంచి వెళ్లిన కొంతమంది ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ కు దీనిపై వినతి పత్రం ఇచ్చారు.
ఇదే సమయంలో ముందు గేటు వద్ద ఆందోళన చేస్తున్న పలువురు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇది హింసాత్మకంగా మారింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లుంగీల్లో వచ్చిన ఎంఎస్ఎఫ్ నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొడుతుండగా, అంతలో ఓ వ్యక్తి వారి మధ్యలోంచి లుంగీ పట్టుకుని పరుగులు తీశాడు. దీంతో అంతలా పరుగెడుతున్నది ఎవరా? అని మీడియా ఫోకస్ చేయగా ఉద్యమాన్ని విరమించేది లేదని బీరాలు పలికిన ఎంఎస్ఎఫ్ లీడర్ షరూఫుద్దీన్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందుకే ఈ కంపేరిజన్ చేయాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more