ఫోన్ లాక్ కోసం భార్యను చంపించాడు | UP man killed his wife through friends for refusing to reveal her phone’s lock code

Up man gets wife murdered for refusing to reveal her phone s lock code

UP man killed his wife through friends, man killed his wife through friends, man killed wife for phone’s lock code

UP man killed his wife through friends for refusing to reveal her phone’s lock code.

ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని భార్యపైకి స్నేహితులను పంపి...

Posted: 09/08/2016 01:48 PM IST
Up man gets wife murdered for refusing to reveal her phone s lock code

వైవాహిక బంధంలో చిన్న చిన్న గొడవలు తప్పవు. అలాంటి వాటికోసం ఏకంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి కొన్ని జంటలు. తాజాగా తన భార్య వాడుతున్న స్మార్ట్ ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదంటూ ఓ భర్త భార్యపై పగ పెంచుకున్నాడు. ఏకంగా తన స్నేహితులను ఆమెపైకి ఉసిగొల్పి దారుణం చేయించాడు. యూపీలో జరిగిన ఈ ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

వినీత్ కుమార్ దివాకర్, పూనమ్ వర్మ భార్యాభర్తలు, వీరికి నాలుగేళ్ల ఓ పాప కూడా ఉంది. వ్యాపారం చేసుకునే వినీత్ కాన్పూర్, ఝాన్సీల మధ్య తిరుగుతూ ఉంటాడు.గత నెలలో ఓ స్మార్ట్ ఫోన్ ను పూనమ్ కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఆ ఫోన్ వాడటం మొదలుపెట్టాక ఆమెలో మార్పు అతనికి కనిపించింది. తననే కాదు, కూతురు కూడా నిర్లక్ష్యం చేయటంతో అతనికి కోపం నషాళానికి అంటింది. దీంతో ఆమె ఫోన్ లో ఏం చేస్తుందా? అని చూడబోయాడు. ఆమె దాన్ని లాక్కున్ని ప్యాట్రన్ లాక్ వేసింది.

ఇక అప్పటి నుంచి ఆమెను కోడ్ చెప్పాల్సిందిగా అతను కోరాడు. ఈ విషయంలో వారి మధ్య వివాదం కూడా జరిగింది. చివరకు ఆగ్రహంతో ఊగిపోయిన భర్త భార్య ను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ లను హత్యకు ఒప్పించి రూ. 80 వేలు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.ముందుగా ప్లాన్ వేసుకున్నట్టుగా ఆగస్టు 29న కాన్పూర్ వెళ్లిన ఆయన, తన భార్యకు ఫోన్ చేసి స్నేహితులు వస్తారని, వారికి తన కంప్యూటర్ ను ఇవ్వాలని చెప్పాడు. వారికి కంప్యూటర్ ను ఇస్తున్న సమయంలోనే పూనమ్ ను వారు హత్య చేశారు. ఆపై ఆభరణాలు తీసుకుని దోపిడీ జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేసి పారిపోయారు.

అయితే భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వినీత్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని స్నేహితుల కోసం గాలింపు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  man  killed  wife  phone lock code  

Other Articles