ఇథియోపియాలో పండగ పూట మారణకాండ చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఇరీచా వేడుకను సంబురంగా జరపుకుంటున్న ప్రజలపై పోలీసు బలగాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 300 మంది మృత్యవాత పడట్లు అనధికార సమాచారం. వందల్లో క్షతగాత్రులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్న ఒరోమో ప్రజలపై పోలీసులు హెలికాప్టర్ల నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఇక్కడి ఫెడరల్ ప్రభుత్వం వీరి హక్కులను కాలరాస్తుండడంతో ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. చాలాకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వీరిని దారుణంగా అణచివేస్తోంది.
ఇథియోపియోలోని పదికోట్ల మంది జనాభాలో అత్యధిక శాతం హోరా అర్సదీ ప్రావిన్సులోనే నివసిస్తారు. వర్షాకాలం ముగిసి వసంతకాలంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒరోమో ప్రావిన్స్‌లో ఇరీచా అనే వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. ఓవైపు వేడుకలు జరుగుతండగానే ఈ దాడులు చోటు చేసుకోవటం విశేషం. రాజధాని అడిస్ అబాబాకు 40 కిలోమీటర్ల దూరంలోని బిష్పొతు నగరంలో ఇరీచా వేడుకలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్రకటనలు చేస్తారన్న ఉద్దేశంతో శనివారం నుంచే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పూనుకుంది. అయినా ఆదివారం హోరా అర్సదీ వద్ద ఇరీచా వేడుకలు మొదలయ్యాయి. పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. నృత్యాలూ చేశారు. ఇదే సమయంలో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు.
గత 11 నెలలుగా ప్రభుత్వ దమనకాండ పెచ్చుమీరడంతో వీరు నిరసను ఉద్ధృతం చేశారు. కాగా ఈ ఉత్సవంలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతారని భావించిన ప్రభుత్వం శనివారం నుంచే పెద్ద ఎత్తున అరెస్టులకు తెరలేపింది. ఆదివారం ఏకంగా కాల్పులకు తెగబడింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీనివల్లే ఎక్కుమంది చనిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కాల్పుల విషయాన్ని అంగీకరించిన ఫెడరల్ ప్రభుత్వం మృతుల సంఖ్యను వెల్లడించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more