దేశంలో క్రమంగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అదే పరిస్థితి ఎదురవ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పరాభవమే ఎదురవ్వనుంది. కాంగ్రెస్ అధికారాన్ని ఇప్పటికే తుడిచిపెట్టి, రాష్ట్రపతి పాలన విధించడంతో.. అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది, అయితే పొంత పార్టీ ఎమ్మెల్యేలకే డబ్బులిస్తూ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అడ్డంగా వీడియోలకు చిక్కారన్న బీజేపి ప్రచారం మాత్రం ప్రభావం చూపింది.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అందుకనే విధించామని చెబుతూ ప్రచారంతో బీజేపికే అక్కడ అధికారం అందే అవకాశాలు వున్నాయని సమాచారం. ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం సాధిస్తుందని యాక్సిస్-ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ 38 నుంచి 43 సీట్లు గెలిచే అవకాశముంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ మెజార్టీ మార్క్ దాటుతుంది.
దాదాపు 50 శాతం మంది ఓటర్లు బీజేపీ సీనియర్ నేత బీసీ ఖండూరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు సర్వేలో తేలింది. 2007-09 మధ్య, మరో పర్యాయం 2011-12 మధ్య కాలంలో ఖండూరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 26 నుంచి 31 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. కాగా ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. 41 శాతం మంది ఓటర్లు హరీశ్ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more