అమ్మ మాట్లాడుతోందంట... నిజమేనా? | Jayalalitha thanked Dr Richard Beale from England

Jayalalitha thanked dr richard beale from england

CM Jayalalitha recover slowly, Ponnaiyan on Jayalalitha's Health, Jayalalitha Thanked to Richard Beale, CM Jayalalitha health bulletin, C.Ponnaiyan

Tamil Nadu CM Jayalalitha recover slowly and thanked Dr Richard Beale from England.

జయలలిత ఆయనకి థాంక్స్ చెప్పిందంట...

Posted: 10/20/2016 09:46 AM IST
Jayalalitha thanked dr richard beale from england

దాదాపుగా 9 రోజుల నుంచి ఎలాంటి బులిటెన్ విడుదల చేయకుండా ఆస్పత్రి వర్గాలు తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య విషయంలో మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో అక్కడ అసలు ఏం జరుగుతుందా అని అభిమానులతోపాటు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత సీ పొన్నైయాన్ ఓ తీపి కబురు చెప్పారు.

ఆమె మాట్లాడటం ప్రారంభించిందని ఆయన అంటున్నాడు. ఇదివరకు తనకు వైద్యం అందించిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బిలేకి థాంక్స్ చెప్పిందని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొన్నైయాన్ తెలిపాడు. పూర్తిగా కొలుకునేందుకు ఆమె మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారని, అందుకే ఆమె మరి కొంత కాలం ఆస్పత్రిలోనే ఉంటారని చెప్పాడు. అంతేకాదు డాక్టర్ బిలే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంగ్లాండ్ నుంచే సమీక్షిస్తున్నాడని వివరించాడు.

ఆమెకి ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకింది. అందుకే ఆమె సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతున్నారు. అందుకే ఆమెకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ట్రీట్ మెంట్ కి ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారంటూ వివరించాడు. కాగా, సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన ఆమె కోలుకోవటానికి ఇంత సమయం పట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. దానికి తగ్గట్లే అక్టోబర్ 10 తర్వాత వైద్యులు ఎటువంటి బులిటెన్ ను విడుదల చేయకపోవటంతో ఆందోళన కాస్త ఎక్కువైంది.

అయితే తాజా ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. లేని పుకార్లు లేపుతోంది ప్రతిపక్ష డీఎంకే అని పొన్నైయన్ అంటున్నాడు. ఇక పుకార్లు లేపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించబోమని, అందరినీ అరెస్ట్ చేసి తీరతామని చెప్పుకొచ్చాడు. కాగా, రాష్ట్ర పాలన కుంటుపడకుండా చూసుకోవాలన్నదే తమ అభిమతం తప్ప, ఆమె ఆరోగ్యంపై పుకార్లు లేపటం తమ పని కాదని డీఎంకే ప్రతినిధి మను సుందరం తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Jayalalitha Health  Ponnaiyan  recover  

Other Articles