వీళ్ల మధ్య మాటల యుద్దం.. వారి మధ్య ప్రత్యక్ష యుద్దం.. SP infighting staged even on silver jubilee celebration

Sp infighting staged even on silver jubilee celebration

silver jubilee celebrations, akhilesh yadav, samajwadi party, uttar pradesh, shivpal yadav, mulayam singh yadav, amar singh, ramgopal yadav, uttar pradesh politics, uttar pradesh elections, up assembly elections, uttar pradesh assembly elections, up polls, up votes, samajwadi party

Akhilesh Yadav and Shivpal shot barbs at each other at an event called to celebrate SP's silver jubilee+ , barely two days after putting up a united show.

వీళ్ల మధ్య మాటల యుద్దం.. వారి మధ్య ప్రత్యక్ష యుద్దం..

Posted: 11/05/2016 09:11 PM IST
Sp infighting staged even on silver jubilee celebration

ఉత్తర ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్ అబ్బాయ్‌ల మధ్య పార్టీ రజతోత్సవ వేడుకల కార్యక్రమాల వేదిక సాక్షిగా మరోమారు బాబాయ్ అబ్బాల మధ్య మాటల తూటాలు పేలాయి.  పార్టీ రజతోత్సవాల వేదికను పార్టీలోని వైరివర్గాలను టార్గెట్ గా చేసేందుకు ఇరువర్గాలు చాకచక్యంగా వ్యవహరించాయి. అయితే వీరు మాటల తూటాలను పేల్చుకుంటున్న ప్రతిసారి.. వారి మద్దతుదారులు, కార్యకర్తలను ఏకంగా దాడులకు ఉసిగోల్పినట్టుగా వుంది.

ముందుగా ప్రసంగించిన రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రసంగిస్తూ తనకు ముఖ్యమంత్రి పదవిపై అలోచన, ఆసక్తి లేదని అన్నారు. తాను తన సోదరుడు పార్టీ అధినేత ములాయం సింగ్ గీసిన గీతను దాటనన్నారు. పార్టీని బలోపేతం  చేయడానికి, ఉనికి కాపాడటానికి తాము ఎన్నో త్యాగాలకు తలొగ్గామని చెప్పారు. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తాననే కొంతమంది నేతలు మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ దెబ్బిపోడిచారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
 
వచ్చే సంవత్సరం యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అంతకుముందు చెప్పారు. మతవాద శక్తులు విజయం సాధించకుండా.. మనం మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతామని కార్యకర్తలతో అన్నారు. ఇదిలావుండగా, ఈ వేడుకలు సాక్షిగా పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సభలో ఎస్పీ నేత జావేద్‌ అబిదీ అఖిలేశ్‌కు మద్దతుగా చాలా ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఎన్నికలకు ముందే అఖిలేశ్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. అఖిలేశ్‌ మద్దతుదారుడైన ఆయన ఇలా మాట్లాడుతుండగానే బాబాయ్‌ శివ్‌పాల్‌ దూసుకొచ్చి.. అబిదీని మధ్యలోనే అడ్డుకున్నారు. బలవంతంగా మైక్‌ ముందునుంచి అవతలకు గెంటేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య ఇది పఛ్ఛణయుద్దానికి తెరతీసిందన్న విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  samajwadi party  mulayam singh  akhilesh yadav  shivpal yadav  silver jubilee celebrations  

Other Articles