పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక పెద్ద కుంభకోణం వుందని, ఈ విషయాన్ని ముందుగానే తమ మిత్రులకు పార్టీ కీలక శ్రేణులకు సమాచారం ఇచ్చారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరోపణలు గుప్పిస్తున్నడంతో ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేసిన ప్రభుత్వ పెద్దలకు కళ్లు చెదిరేలాంటి ఆధారాలు కనిపిస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి విపక్షాలు. బీజేపీకి నల్ల ధనాన్ని తేవడంలో చిత్తశుద్ది లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తమ కష్టాలకు, బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నేతలకు ఈ రద్దు వ్యవహారం ముందే తెలుసని, అందరూ మూటాముల్లె సర్దుకున్నాక అదేదో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంలా ప్రజలను మభ్య పెడుతున్నారని కేజ్రీవాల్ అరోపణలు నిజమని పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్న ఓ పరిణామం రుజువు చేస్తుంది. దీంతో అక్కడి బీజేపీ నేతలతో పాటు కేంద్ర బీజేపి నాయకులు కూడా కలవరపాటుకు గురవుతున్నారు. అయితే అది కేవలం అరోపణలు మాత్రమే కాదు అందుకు సంబంధించిన డాక్యూమెంట్లను కూడా విపక్షాలు నెట్ లో పోస్టు చేయడంతో ఇప్పడీ అంశం సంచలనంగా మారింది.
మోదీ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు బెంగాల్ బీజేపీ పార్టీ 3 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఆధారాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పార్టీ తరపున బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంలో తప్పుబట్టాల్సిందేమీ లేదని, కానీ ఇంత మొత్తంలో కొద్ది వ్యవధిలో, ఒకేసారి డిపాజిట్ చేయడంపైనే తమకు అనుమానాలున్నాయని నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నోట్ల రద్దు ప్రసంగం మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు కూడా ఆ పార్టీ తరపున బ్యాంకులో 40లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు చెప్పడానికి ఆధారమిదే అంటూ ఆ బ్యాంకు డాక్యుమెంట్‌ను చూపిస్తున్నారు. అది కూడా సేవింగ్స్ అకౌంట్ లో జమచేయడం అరోపణలకు బలాన్నిస్తుంది.
సేవింగ్స్ అకౌంట్‌లో, అకౌంట్ నెం.554510034తో భారతీయ జనతా పార్టీ, పశ్చిమబెంగాల్ పేరుతో డబ్బు డిపాజిట్ చేసినట్లు ఆ డాక్యుమెంట్‌లో ఉంది. కోల్‌కత్తాలోని ఇండియన్ బ్యాంకు సెంట్రల్ ఎవెన్యూ బ్రాంచిలో ఈ డబ్బు డిపాజిట్ చేశారని నేతలు చెబుతున్నారు. అంతేకాదు, బీజేపీ నేత సంజీవ్ కంబోజ్ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌పై కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ త్వరలో 2వేల రూపాయల నోట్లను జారీ చేయనున్నట్లు ఫోటోతో సహా ట్విట్టర్‌లో సంజీవ్ పోస్ట్ చేశారని చూపుతున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతలకు ఈ విషయం ముందే తెలుసనే అనుమానం కొందరిలో వ్యక్తమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more