మాములుగా తమ కూతుళ్లకి ఎవడైనా లవ్ ప్రపోజ్ చేస్తే ఏ తండ్రైనా చూస్తూ ఊరుకుంటాడా? తుక్కు రేగొట్టడూ... అలాంటిది బ్రిటన్ లో ఓ తండ్రి మాత్రం తన కూతురికి వచ్చిన ప్రేమ కానుక గురించి సంబరంగా వీడియో తీసి అప్ లోడ్ చేయగా, 2 కోట్ల మంది పైగానే ఎగబడిపోయి వీక్షించారు. ఎందుకంటారా? కనీసం లవ్ అన్న పదానికి స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాని బుడతడు, అవతల ఉంది ఓ బుడ్డది కావటమే ఇందుకు కారణం...
ఎలిమెంటరీ విద్య చదువుతున్న మిల్లీ ఒకరోజు స్కూలు నుంచి వచ్చి, తన తల్లిదండ్రులతో తన బ్యాగులో ఉంగరం ఉందని, తనకు టామీ ప్రపోజ్ చేసి ఇచ్చాడని చెప్పింది. ఆ వయసు పిల్లాడు ఏమిస్తాడు, బహుశా బొమ్మ ఉంగరం ఇచ్చి ఉంటాడని మిల్లీ తల్లిదండ్రులు భావించారు. అయితే ఆమె బ్యాగు ఓపెన్ చూసిన వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే, ఆ బ్యాగులో ఉన్నది బొమ్మ ఉంగరం కాదు... మూడు వజ్రాలు పొదిగిన ఒరిజల్ రింగ్.
ఇంకేం దానిని చూపుతూ మిల్లీ తండ్రి ఓ వీడియో సందేశం తయారు చేసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అవుతోంది. కావాలంటే ఆ వీడియోను మీరు కూడా చూడండి. ఇంతకీ ఆ ఉంగరం టామీ తల్లి ఎంగేజ్ మెంట్ రింగ్ అంట. దానిని దొంగిలించికొచ్చి మరీ మిల్లీని పడగొట్టాలని ప్రయత్నించాడన్న మాట. బేవోన్స్ సింగిల్ లేడీస్ పాటలో నచ్చితే ఉంగరం తొడిగేసేయ్ రా... అన్న మాటను ఈ బుడ్డొడు సీరియస్ గా తీసుకున్నాడేమో... అందుకే ఇలా డేర్ చేసేశాడు. అన్నట్లు వీడియో చివర్లో ఆ టామీని మీరు కూడా చూడొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more