బిలియనర్ ఆస్తితో ఆ ఊళ్లో అంతా మిలీనియర్లే.. అసలు కథ| Man Leaves $200M Fortune To His Hometown Of 80 People.

Billionaire makes every resident of native village a millionaire

Corona beer founder, Spanish village, Antonio Fernandez, Billionaire donates millions, Man donates millions, Richest Village, Rich Village, all millionaires,

Corona beer founder makes everyone in his village a millionaire fake.

ఆ ఊళ్లో అందరూ కోటీశ్వరులే... అంతా ఫేక్

Posted: 12/02/2016 07:48 AM IST
Billionaire makes every resident of native village a millionaire

పక్కవాడికి సాయం చేసేందుకు పదిసార్లు ఆలోచించే మనుషులు ఉన్న ఈ రోజుల్లో ఓ పెద్దాయన తాను సంపాదించిన అక్షరాల 14వేల కోట్ల రూపాయలను పేదలకు పంచేశాంటే ఎలా ఉంటుంది?. అవును... స్పెయిన్ కు చెందిన వ్యాపారవేత్త ఆంటొనినో ఫెర్నాండెజ్ తన ఊరి ప్రజల కోసం ఇంత మొత్తాన్ని వితరణగా పంచేశాడంట. ఆయనేంటో.. ఆ కథేంటో... చూద్దాం పదండి.

1917లో స్పెయిన్ లోని సెరెజల్స్ డెల్ కొండాడొ గ్రామంలో నిరుపేద కుటుంబంలో అంటొనినో జన్మించాడు. ఆ ఊళ్లో 80 మంది జనాభా అయితే, అతని ఇంట్లోనే 13 మంది అక్కచెల్లెలతో సహా 16 మంది ఉండేవారు. అంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి సంపాదన చాలలేదు. దీంతో ఫెర్నాండెజ్ 14 ఏళ్ల వయస్సులో చదువుకు స్వస్తి చెప్పి కుటుంబ పోషణ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. ఆ క్రమంలోనే బతుకు దెరువు నిమిత్తం 1949లో భార్యతో కలిసి మెక్సికో వలస వెళ్లాడు.

అక్కడ అనుకోకుండా అదృష్టవశాత్తూ ఓ ప్రముఖ పానీయాల తయారీ సంస్థలో ఉద్యోగం సాధించాడు. 70వ దశకంలోకి వచ్చేసరికి గ్రూపో మోడెలో అనే కంపెనీకి సీఈవోగా మారిపోయాడు. ఆ తర్వాత బయటికి వచ్చి సొంతంగా బీర్లను తయారు చేసే కంపెనీ పెట్టాడు. దాని ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జించాడు. అయితే వేలకోట్ల ధనవంతుడిగా ఎదిగినప్పటికీ తన సొంత ఊరిని మాత్రం ఫెర్నాండెజ్ మరువలేదు. సాధారణంగా దానగుణం ఉన్నవారు ఊరిని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తారు. కానీ ఈ వ్యాపారవేత్తం మాత్రం అలా చేయలేదు.

Antonio Fernandez

కొంచెం ముందుకు వెళ్లి ఏకంగా తాను సంపాదించిన 210 మిలియన్ డాలర్ల ఆస్తిని(సమారు రూ.14వేల కోట్ల ఆస్తి) తన ఊరి ప్రజలకు రాసిచ్చేశాడు. రాత్రికి రాత్రే ఆ ఊరంతా ధనికులుగా మారిపోయారు. ఒక్కో కుటుంబానికి రూ.17.50 కోట్ల దాకా వచ్చాయి. ఇప్పుడక్కడ పేద వారు అస్సలు కనబడరు. కాగా ఈ ఏడాది ఆగస్ట్ నెలలో ఫెర్నాండెజ్ (99) మృతి చెందాడు. అయినప్పటికీ తన ఊరి వాసులు ఆయన్ను మరిచిపోలేదు. ఆయన పేరిట ఆలయాన్ని కట్టించి అందులో ఫెర్నాండెజ్ను దేవుడిగా కొలుస్తున్నారు. నిత్యం ఆయనకు ప్రార్థనలు చేస్తున్నారు. ఇది ఫేస్ బుక్ లో చక్కర్లు కొడుతున్న కథ.

దీంతో యూకే కి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆరాలు తీయటం మొదలుపెట్టింది. వెగాస్ డెల్ కొడాడో కౌన్సిల్ ను సంప్రదించటంతోపాటు, ఆ ఊరి ప్రజలను కలిసి ఇంటర్వ్యూ తీసుకుంది . ఆ ఊళ్లో అలాంటి గుడి ఏం లేదు. పైగా తాము కోటీశ్వరులం అన్న మాట పచ్చి అబద్ధం అని, తమకు ఎవరు ఎలాంటి సాయం చేయలేదంటూ ఆ గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఆ ఊళ్లో అంతా వ్యవసాయం, గోర్రెలు పెంపకం ద్వారానే జీవనం కొనసాగిస్తున్నారని వివరించారు. దీంతో ఆ కథ అంతా ఉత్తదేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Corona beer founder  Spanish village  Antonio Fernandez  donate millions  home town  

Other Articles