ఉత్సవాలకు సిద్దమైతున్న వేళ.. పెను విషాదం.. Nigeria Uyo: Scores dead in church collapse

Nigeria uyo scores dead in church collapse

church building collapse, Governor Emmanuel, Uyo, Akwa Ibom State capital, Uko Ima, St. Luke Hospital, Nigeria, world news

Tragedy struck in the least anticipated place, yesterday, Reigners Bible Ministry, Uyo, Akwa Ibom State capital, after the church building collapsed during a service.

ఉత్సవాలకు సిద్దమైతున్న వేళ.. పెను విషాదం..

Posted: 12/11/2016 10:13 AM IST
Nigeria uyo scores dead in church collapse

మరో పక్షం రోజుల వ్యవధిలో వస్తున్న క్రీస్మస్ పండుగను పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేళ నైజీరియాలో పెను విషాధం సంభవించింది. భక్తులు ప్రార్థనలు చేసుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నైజీరియాలోని ఆక్వా ఇబోమ్ రాష్ట్రంలోని ఉయోలో నిర్మాణంలో ఉన్న ‘ది రెయినర్స్ బైబిల్ చర్చ్’ అనూహ్యంగా కూలిపోవడంతో దాదాపు 200 మంది మరణించారు.. క్రిస్మస్ వేడుక నేపథ్యంలో చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి  క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆక్వా ఇబామ్ రాష్ట్ర గవర్నర్ ఉడోం ఇమ్మాన్యువల్ కూడా ఈ సంఘటన జరిగిన సమయంలో చర్చిలోనే ఉన్నారు.

అయితే ఇమ్మాన్యువల్కు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ సంఘనపై  నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 60 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఉడోం ఇమ్మాన్యువల్ దర్యాప్తుకు ఆదేశించారు. చర్చి ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా, క్రిస్మస్ సమీపిస్తుండగా వేగంగా పైకప్పు పనులను పూర్తి చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nigeria  Uyo  church building collapse  200 dead  world news  

Other Articles