కాంతి తగ్గుతున్న పసిడి ధగధగలు India 2017 gold demand to be muted: WGC

Demonetisation lowers india s gold demand to 7 year low in 2016

gold, silver, imports, demonetisation, ornamental gold, pan card, gold demand, World Gold Council, Somasundaram PR, old prices, WGC report, China

WGC report said that continued global economic and political uncertainty, mostly Brexit, the US election and currency weakness in China, helped to boost investment demand in gold by 70 per cent.

కాంతి తగ్గుతున్న పసిడి ధగధగలు

Posted: 02/03/2017 09:15 PM IST
Demonetisation lowers india s gold demand to 7 year low in 2016

దేశీయంగా బంగారం డిమాండ్ పడిపోయిందట. 2016లో బంగారం డిమాండ్ 21 శాతం మేర పడిపోయి 675.5 టన్నులుగా నమోదైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. భారత్లో బంగారం డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలు జువెలరీ సమ్మె, పాన్ కార్డు అవసరాలు, డీమానిటైజేషనేనని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2015లో బంగారం డిమాండ్ 857.2 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ రివీల్ చేసింది. ఆభరణాల డిమాండ్ కూడా దేశంలో 22.4 శాతం క్షీణించిందని పేర్కొంది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉంటే, 2016కు వచ్చే సరికి ఈ డిమాండ్ 514 టన్నులుగా నమోదైందని తెలిపింది.

ఆభరణాల పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని, ఇది డిమాండ్పై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. అయితే గ్రెట్ బ్రిటన్ లో బ్రిగ్జిట్ నుంచి ప్రారంభమైన డిమాండ్.. చైనా కరెన్సీ విలువను తగ్గించిన నేపథ్యంలో మరింతగా తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కోంది. ఆ తరువాత అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మరింతగా కుంగిపోయిందని తెలిపింది. ఇక మన దేశంలో అయితే డిమానిటైజేషన్, ఆభరణాల కోనుగోలుపై అంక్షల నేపథ్యంలో ధగధగలు క్షీణించాయని తెలిపింది.
 
పాన్ కార్డు నిబంధన, జువెలరీపై ఎక్స్చేంజ్ డ్యూటీ, డీమానిటైజేషన్, ఆదాయపు పన్ను వెల్లడి పథకం డిమాండ్ను దెబ్బతీస్తుందన్నారు. కానీ ఇవన్నీ ఆర్థికవ్యవస్థను మరింత బలపర్చేలా చేస్తాయన్నారు. గోల్డ్ ఇండస్ట్రిలో పారదర్శకతను కూడా తీసుకొస్తాయన్నారు. నగదు కొరత గ్రామీణ ప్రాంతాన్ని ఎక్కువగా దెబ్బతీసిందని, కానీ ఈ ప్రభావం తాత్కాలికమేనని, మంచి రుతుపవనాలు బంగారం డిమాండ్కు మద్దతిస్తాయని వివరించారు. 2017లో బంగారం డిమాండ్ 650-750 టన్నుల వరకు ఉంటుందని సోమసుందరమ్ అంచనావేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles