అమ్మ చనిపోయి అప్పుడే రెండు నెలలు గడిచిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాక క్రమక్రమంగా తనవైపు ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తల దృష్టిని మరల్చేందుకు శశికళ నటరాజన్ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నమ్మ ట్యాగ్ లైన్ ఏనాడో దక్కినప్పటికీ, జయలా ఓ చరిష్మాను తన వశం చేసుకునేందుకు మాత్రం ఇంకా సమయం పట్టేలాగే ఉంది. ఇదిలా ఉంటే పార్టీలో అంతర్గతంగా
తనపై నెలకొన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు నెమ్మదిగా ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో శశికళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాతకాపులకు(సీనియర్లకు) పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీలో సంస్థాగతంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమయ్యింది. కొన్ని రోజులుగా పార్టీలోని సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశాల్లో సేకరించిన వివరాల ఆధారంగా పదవుల పందేరానికి తెరతీయనున్నట్టు సంకేతాలు పంపించారు. ఇప్పటికే పార్టీలోని కొందరిని తప్పించిన శశికళ సీనియర్ నేతలు కేఏ సెంగొట్టయ్యన్, గోకుల ఇందిర, సైదై దురైస్వామి, కరుప్పుస్వామి పాండ్యన్ వంటి నేతలను పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం శశికళ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తాను పార్టీ బలోపేతం కోసం కొందరిని కార్యనిర్వహణ కార్యదర్శులుగా నియమించానని, అదే క్రమంలో పార్టీ పరువును బజారుకీడుస్తున్న కొందరిని తప్పించానంటూ అందులో పేర్కొంది. పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నేతలు దటీజ్ శశికళ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ప్రస్తుతం ఆమె నియమించుకున్న వారిలో ఎక్కువ మంది జయ అంటే గిట్టని వాళ్లు, పొసగని నేతలే ఉండటం కొసమెరుపు. దీంతో అమ్మ ఆత్మ ఘోషిస్తుందంటూ పలువురు కార్యకర్తలు శశికళ నిర్ణయంపై మండిపడుతున్నారు.
విచారణకు అపోలో సిద్ధం...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతిపై విచారణకు సిద్ధమని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించారు. శుక్రవారం చెన్నైలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జయలలిత మృతి విషయంలో ఎటువంటి విచారణను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిపితే అన్ని విధాలా పూర్తిగా సహకరిస్తామన్నారు. జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందనుకుంటున్న సమయంలో వచ్చిన గుండెపోటు వల్లే ఆమె మృతి చెందారని ప్రతాప్ సి.రెడ్డి వివరించారు. చనిపోవడానికి ముందు జయ కాళ్లను తొలగించామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more