చెత్త కుప్ప 50 మందిని మింగేసింది... | Landslide at Ethiopia landfill kills 50.

Rubbish dump landslide kills at least 50 in ethiopia

Ethiopia, Rubbish Mishap, Ethiopia Capital Addis Ababa, Garbage Dump Landslide, Ethiopia Garbage Mishap, Rubbish Dump Accident, Ethiopia Garbage, Rubbish Dump Landslide,

Rubbish dump landslide kills 35 outside Ethiopia capital Addis Ababa, dozens missing.

చెత్త కుప్ప కూలి 50 మంది మృతి

Posted: 03/13/2017 07:49 AM IST
Rubbish dump landslide kills at least 50 in ethiopia

ఇథియోపియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ డంప్ యార్డ్ లో భారీగా పేరుకుపోయిన చెత్త కుప్ప కూలి సుమారు 50 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని అడిస్ అబాబ లో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటు చేసుకుంది.

నగరానికి పొలిమేరల్లో ఉన్న కోషే లాండ్ ఫిల్ ప్రాంతంలో ఓపెన్ ఏరియాలో పెద్ద చెత్త పడేసే ప్రాంతం ఉంది. అయితే అది ఎత్తైన ప్రదేశంలో ఉండటం, దిగువ ప్రాంతంలో వందల మంది ఇళ్లు నిర్మించుకుని నివసిస్తుండటంతో భారీ ప్రమాదం జరిగింది. ఓ భారీ చెత్త కుప్ప ఒక్కసారిగా కూలి కిందికి దొర్లుకుంటూ రావటంతో అక్కడికక్కడే 46 మంది సజీవ సమాధి అయ్యారు. మరికొందరు చెత్త కిందే ఇరుక్కుపోగా వారిని స్థానికులు రక్షించారు.

30 ఎకరాల ఆ ప్రాంతంలో వారంతా అనుమతులు లేకుండా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని అధికారి ఒకరు తెలిపారు. వారంతా చెత్త సేకరణే జీవనాధరంగా బతుకుతున్నట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు, 15 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితమే డంప్ యార్డ్ ను అక్కడి నుంచి తరలించేందుకు ప్రభుత్వం యత్నించగా, తమ పొట్టకొట్టొద్దంటూ వారంతా నిరసనకు దిగి అడ్డుకున్నారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ethiopia  Addis Ababa  Garbage Dump Landslide  

Other Articles