వీళ్లు పోలీసులు.. వీరికి రూల్స్ అసలుండవ్..! MP cops caught drinking beer inside police station premises

Woman si thrashes youths for not wearing helmets

woman cop thrases youths, somanahalli, mysuru-bengaluru, Maddur, hemmanahalli, holi, gwalior police, drunk cops, Chawni Police Station, madya pradesh

Gwalior Superintendent of Police suspended 15 police officersfor consuming alcohol inside Chawni Police Station. A woman police officer allegedly roughed up two youths for not wearing helmets on the Mysuru-Bengaluru highway at Somanahalli village near Maddur.

ITEMVIDEOS: వీళ్లు పోలీసులు.. వీరికి రూల్స్ అసలుండవ్..!

Posted: 03/16/2017 07:04 PM IST
Woman si thrashes youths for not wearing helmets

సమాజాన్ని సన్మార్గంలో పయనింపజేయడంతో పాటు అవసరమైన సందర్భంలో వారిని శిక్షించేందుకు భారతీయ శిక్షాస్మృతిలోని చట్టాల ప్రకారం వారిని కోర్టుల ఎదుట హాజరుపర్చాల్సిన పోలీసులు.. తమ రూటు సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులే ముందు పౌరుల్లా నియమనిబంధనలు పాటించాల్సింది పోయి.. మేము పోలీసులం.. చట్టాలను అచరింపజేసే వారికే చట్టాల గురించి చెబుతావా..? అన్నట్లుగా ఎదురుప్రశ్నిస్తే ఏదో ఒక సెక్షన్ కింద కటకటాల్లోకి నెడుతామనే పోలీసు అధికారులను మనం తరచూ చూస్తూనే వున్నాం.

అధికారం చేతిలో వుందికదా.. అని ఎలా పడితే అలా చేయడం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత వారికి కూడా కొంత కష్టంగానే మారింది. ఎందుకంటే సోషల్ మీడియా వారిపై నిఘా నేత్రంగా పనిచేస్తుంది. ఈ విషయం తెలియక రెండు వేర్వురు ఘటనల్లో పోలీసు అధికారులు చిక్కకుని చిక్కుల పాలయ్యారు. ఓ సంఘటనలో పోలీసులు ఏకంగా ఠాణాలోనే మధ్యం సేవించి దోరికిపోగా, మరో ఘటనలో హెల్మెట్ లేదని ఏకంగా ఇద్దరు యువకులపై ఓ మహిళా పోలీసుల తన ప్రతాపాన్ని చూపించారు.

సాక్షాత్తూ పోలీసు స్టేషన్‌ లోపలే. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో హోలి పండగ మరుసటి రోజున మంగళవారం రోజున రంగులు పూసుకుని పోలీసులు ఏకంగా పోలిస్టేషన్ లోనే రంగులు చల్లుకున్నారు. అంతటితో అగకుండా వారి జోష్ కు మరింత జోష్ తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులు మద్యం కూడా తెప్పించారు. ఒకరి చేతిలో సీసాను అందరి నోళ్లలో సోసి మరీ సేవించారు. ఇదంతా కనీసం సివిల్ దుస్తుల్లో వుండి చేసుంటే పోలీసులు కాదేమో అని భావించేవారు.. కానీ పోలీసు దుస్తుల్లోనే మందుకొట్టారు. ఇది కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. చివరకు 15 మందిని పోలీస్ కమీసనర్ సస్పెండ్ చేశారు.

ఇక మరో సంఘటనలో కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ హైవేలో సావి అనే మహిళ ఎస్‌ఐ.. మద్దూరు సమీపంలో సోమనహళ్లి గ్రామం వద్ద సావి పోలీసులతో కలసి వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నరసింహ, నిషాంత్ అనే ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్‌పై వచ్చారు. చట్టప్రకారం హెల్మెట్ ధరించనందుకు వారికి జరిమానా విధించడంతొ పాటు వారిని నడిరోడ్డుపైనే ఎడాపెడా వాయించింది. అంతటితో అగకుండా ఏకంగా నోటికోచ్చినట్లు బండబూతులు, అసభ్యపదజాలాన్ని వినియోగించింది. అయితే ఇంకా కసి తీరకపోవడంతో వారిని స్టేషన్ కు తీసుకువచ్చి వారిపై తన విధులను అటంకపర్చినట్లు కేసు కూడా నమోదు చేశారు.

కాగా ఆ సమయంలో అక్కడున్నవారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఎస్‌ఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేశారు. హెల్మెట్ వాడనందుకు తాము జరిమానా చెల్లించామని, అయినా మహిళా ఎస్‌ఐ తమను దూషించి చేయి చేసుకున్నారని బాధిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ.. ఎస్ఐ సావి దురుసుగా ప్రవర్తించడం తప్పేనని, విచారణకు ఆదేశించామని, ఆమె తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles