ట్రాయ్ అదేశాలతో అటకెక్కిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్లు.. Trai forces Reliance Jio to withdraw Summer Surprise offer

Reliance jio stopping 3 month complimentary summer surprise offer

TRAI, RIL, Reliance Jio, Reliance Industries Limited, Reliance Industries, jio welcome, Jio Summer Surprise, Airtel, vodafone, idea, aircel, bsnl

The telecom regulator ordered Reliance Jio Infocomm to withdraw its Summer Surprise plan that offered three months of free services to a user who paid an initial fee by April 15,

ట్రాయ్ అదేశాలతో అటకెక్కిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్

Posted: 04/07/2017 09:27 AM IST
Reliance jio stopping 3 month complimentary summer surprise offer

రిలయన్స్ జియోకు కస్టమర్లకు చేదు వార్త. గత కొన్ని నెలలుగా ఉచితంగా అటు డాటాతో పాటు ఇటు అన్ లిమిటెడ్ గా కాల్స్ చేసి తెగవాడేస్తున్న వినియోగదారులకు ట్రాయ్ షాకిచ్చింది. అదేనండీ నేరుగా కస్టమర్లకు కాకుండా ఏకంగా కంపెనీకే వార్నింగ్ ఇచ్చేసింది. ఈ అర్థిక సంవత్సరం నుంచి కస్లమర్లుకు ఉచిత అఫర్ ను ఎత్తేసిన జీయో.. సమ్మర్ సర్ ప్రైజ్ పేరుతో కస్టమర్లను అకర్షించేందుకు చేసిన ప్రయత్నాలను మానుకోవాలని సూచించింది. అయితే ఈ ఆపర్ ను తక్షణం రద్దు చేయాలని టెలికాం రెగ్యూలేటరీ సంస్థ ట్రాయ్ రిలయన్స్ జియో యాజమాన్య సంస్థకు అదేశాలను జారీ చేసింది.

ఈ నెల 15 వరకు ఎవరైతే 99 రూపాయలతో ప్రైమ్ మెంబర్ షిఫ్ తీసుకుంటారో వారందరికీ మరో మూడు నెలల పాటు ఉచిత సేవలను అందిస్తామని జియో ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోటీ సంస్థలు మరోమారు ట్రాయ్ తలుపును తట్టగా, సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తక్షణం రద్దు చేయాలని అదేశాలను జారీ చేసింది. ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్‌ జియోకు సూచించింది. ట్రాయ్‌ ఆదేశాలపై ఏకీభవిస్తామని ప్రకటించిన జియో… కొద్ది రోజుల్లోనే అమలు చేస్తామని తెలిపింది. అయితే ఇది వరకే ‘సమ్మర్‌ సర్‌ప్రైజ్‌’ రీచార్జ్‌ చేసుకున్నవారికి మాత్రం ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో ఇక జియో ఫ్రైమ్ అఫర్ ఈ నెల 15 వరకు వర్తించినా.. ఇకపై ప్రైమ్ మెంబర్ షిప్ పోందేవారు మాత్రం మూడు నెలల సమ్మర్ సర్ ప్రైజ్ ఉచిత సేవలను అందుకోలేరని స్పష్టం అవుతుంది. తొలుత మార్చి 31లోపు జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలని ప్రకటించిన జీయో సంస్థ.. మార్చి 29, 30, 31 రోజుల్లో కస్టమర్ల తాకిడికి జియో వెబ్‌సైట్‌, యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా.. దానిని మరో పక్షం రోజుల పాటు పొడిగించిన విషయం పాఠకులకు విధితమే. దీంతో కేవలం రూ.303కే మూడు నెలలపాటు ఉచిత కాలింగ్‌, రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని కొత్త ఆఫర్‌ను ప్రకటించి మరింత మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles