మూడు రోజలుగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న అన్నాడీఎంకే నేత దినకరన్ వ్యవహారం సస్పెన్స్ సీరియల్ ను తలపిస్తోంది. సుఖేష్ చంద్రశేఖర్ అంటే ఎవరో తెలియదని చెప్పిన శశికళ సోదరి కుమారుడు చివరకు అతన్ని కలిసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు చూపిన వీడియో సాక్ష్యంతో నిజం ఒప్పేసుకున్నాడని చెబుతన్నప్పటికీ, ఇంతకీ నిజం కక్కించిన ఆ వీడియోలో ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి సుకేష్ ను విచారించిన తరువాత ఈ కేసులో దినకరన్ చేసిన లంచం కుట్ర విషయం బయటకు వచ్చింది. ఆపై వారిద్దరికీ ఉన్న సంబంధాలపై జనార్దనన్, మల్లికార్జున అనే వ్యక్తుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. ఇక దినకరన్ ను విచారిస్తున్న వేళ, తొలుత వీరిద్దరి పేర్లనే పోలీసులు ప్రస్తావించారు. ఆపై తాను సుకేష్ తో మాట్లాడిన మాట వాస్తవమేనని, అయితే, అ వ్యక్తే సుకేష్ అని తెలియదని, న్యాయమూర్తితో మాట్లాడానని అనుకున్నానని బుకాయించబోయాడు.
దీంతో పోలీసులు వారి వద్ద ఉన్న వీడియో అస్త్రాన్ని బయటకు తీశారు. దినకరన్, సుకేష్ ల మధ్య జరిగిన సంభాషణ వీడియోను చూపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో సుకేష్ తో తన పరిచయాన్ని దినకరన్ అంగీకరించి, చేసిన తప్పంతా చెప్పుకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుకేష్ తో పరిచయం, అది ఎలా కొనసాగింది? డబ్బును ఢిల్లీకి ఎలా పంపించారు? ఎవరి ద్వారా ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని అనుకున్నారు? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇత్యాది విషయాలను పూస గుచ్చినట్టు చెప్పేశాడని చెబుతున్నారు.
దీంతో ఈ కేసులో జోక్యం ఉన్న మరింత మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు వీళ్లతోపాటు ఈ వ్యవహారంలో ఎన్నికల అధికారి ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే తాను సుకేశ్ ను కలిసినప్పటికీ ఈసీ లంచం విషయం మాత్రం పూర్తిగా అబద్ధమన్న మరో వాదనను కూడా పోలీసుల ముందు దినకరన్ లేవనెత్తాడంట.
దినకరన్ ను అరెస్ట్ చేశారా?
ఈ కేసులో నేడు వరుసగా నాలుగో రోజు దినకరన్ ను పోలీసులు విచారణకు పిలివటంతో నేడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో విచారణలో ఉన్న దినకరన్ ఫెరా కేసు విచారణకు సంబంధించి దినకరన్ ప్రతి రోజు తమిళనాడులోని ఎగ్మూర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ప్రస్తుత పరిణామాలతో రాలేకపోయాడు. దీంతో దినకరన్ కోర్టుకు ఎందుకు రాలేదంటూ జడ్జి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... ఢిల్లో పోలీసుల సమక్షంలో విచారణ కొనసాగుతోందని, అందువల్ల ఆయన కోర్టుకు రాలేకపోయారని న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా జడ్జి జోక్యం చేసుకుంటూ... దినకరన్ ను అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ఇందుకు... దినకరన్ ను అరెస్ట్ చేయలేదని లాయర్ సమాధానం చెప్పారు. ఒకవేళ దినకరన్ ను అరెస్ట్ చేస్తే, ఆ విషయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు జడ్జి.
అన్నాడీఎంకే విలీనం హైడ్రామా...
రెండుగా చీలిన అన్నాడీఎంకే ఒక్కటవుతుందన్న వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించటంలేదు. ముఖ్యమంత్రి పళని వర్గం ముందు ఉంచిన డిమాండ్లు నెరవేరిస్తేనే విలీనం గురించి ఆలోచిద్దామని పన్నీర్ వర్గం తేల్చి చెబుతోంది. శశికళ, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి పంపించడంతోపాటు జయ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే చర్చల సంగతి చూద్దామని కుండబద్దలు కొట్టింది.
నిజానికి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో విలీనంపై ఇరు వర్గాలు చర్చించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం ఓపీఎస్ వర్గానికి చెందిన కేపీ మునుస్వామి, ఎంపీ మైత్రేయన్‌లు విలేకరులతో మాట్లాడుతూ తాము విధించిన రెండు డిమాండ్లు నెరవేరితేనే చర్చల విషయాన్ని ఆలోచిద్దామని పేర్కొన్నారు. ఆయన ప్రకటనతో షాకైన ఈపీఎస్ వర్గం చివరి క్షణంలో ఇటువంటి మెలికలు సరికాదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని, కాబట్టి చర్చలకు రావాలని కోరింది.
మరోవైపు శశికళను పార్టీ నుంచి తొలగించాలన్న ఓపీఎస్ డిమాండ్‌పై చర్చించేందుకు బుధవారం పార్టీలో అత్యంత కీలకమైన జిల్లా కార్యదర్శులతో భేటీ కావాలని సీఎం పళనిస్వామి నిర్ణయించాడు. కాగా, సోమవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోని శశికళ చిత్రపటాలను సీఎం పళనిస్వామి ఉండగానే తొలగించటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more