కామా తురానా: నభయం నలజ్జ అన్న విధంగా జైలు గోడల మధ్య వున్నా ఈ ఖైదీలో పరివర్తన రాకపోగా తమ జీవితాలు ఆరోగ్యకరంగా వుండేందుకు చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ ఖైదీ. మంచి భోజనం కోసమో, సౌకర్యాల కోసమో ఖైదీలు ఆందోళనలు చేయడం సాధారణ విషయమే కానీ.. నవ్విపోదురు గాక నాకేటీ సిగ్గు అన్నట్లుగా వుండి ఈ ఖైది డిమాండ్. తమ శరీరంలోని వేడిని తగ్గించేందుకు చట్టంలో మార్పులను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాడు. తమ డిమాండ్ ను అమలు పరిస్తే జైలుగోడల మధ్య పెద్ద సంఖ్యలో వున్న యువఖైదీల శాంతియుతంగా మెసిలేందుకు అవకాశముంటుందని కూడా వాదిస్తున్నాడు. అసలు ఈ ఖైదీ డిమాండ్ ఏంటో చూద్దామా..!
బ్రిటన్ లోని నాటింగ్ హమ్ షైర్ ప్రాంతంలోని హెఛ్ ఎం పి గ్రామేంజ్ జైలులో 17 ఏళ్ల కారాగారశిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఈ వింత డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చి.. వార్తల్లో నిలిచాడు. మాదకద్రవ్యలను బ్రిటెన్ కు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న జాక్ స్వారేజ్.. ఏకంగా జైలు వెబ్ సైట్ వేదికగా తాజా డిమాండ్ ను తెరపైకి తీసుకోచ్చాడు. అయితే స్వారేజ్ కు అనూహ్యంగా బయటి నుంచి మద్దతు ప్రకటిస్తున్న వారి సంఖ్య కూడా అధికమైంది.
ఇంతకీ సార్వేజ్ డిమాండ్ ఏంటో తెలిస్తే అవ్వాక్కవ్వాల్పిందే. ఏళ్లుగా జైలు గోడల మధ్య జీవనం సాగిస్తున్న ఖైదీలకు సెక్స్ డాల్స్ కావాలన్న డిమాండ్ తో సార్వేజ్ ప్రచారం చేపట్టాడు. చాన్నాళ్లుగా జైలు లోపలి పరిస్థితులను నిశితంగా గమనించిన ఆయన.. సమాజం ఆశించిన మేరకు ఖైదీలలో పరివర్తన రావాలంటే తరచూ శృంగార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నాడు. అందుకే ఖైదీలు సెక్స్ డాల్స్‌ను వినియోగించుకునేలా చట్టాలు సవరించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పైసా ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదని, ఖైదీల సొంత డబ్బుతోనే రబ్బరు బొమ్మల్ని కొనుక్కునే వీలు కల్పించాలని కోరుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more