Can't deploy police everywhere to control crime: UP minister అమాత్యుని ‘‘బోడ మల్లయ్య’’ వ్యాఖ్యలు వివాదాస్పదం

Can t deploy police everywhere to control crime up minister

BJP, clashes, Crime Free, Dalit, gangrape, Jewar, mla, MP, Nodia Expressway, Saharanpur, Suresh Khanna, thakur, UP CM, Yogi Adityanath

Responding to the recent spate of crime and clashes in the state, UP minister Suresh Kumar Khanna said that the government did not promise a ‘crime-free UP’.

అమాత్యుని ‘‘బోడ మల్లయ్య’’ వ్యాఖ్యలు వివాదాస్పదం

Posted: 05/26/2017 03:55 PM IST
Can t deploy police everywhere to control crime up minister

ఎన్నికలకు ముందు ఓడ మల్లయ్య అనే రాజకీయ నాయకులు ఎన్నికలు ముగిసి.. అధికారంలోకి రాగానే బోడ మల్లయ్య అని అంటారన్న విమర్శలు సర్వత్రా వున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎన్నికలైన తరువాత కూడా నెరవేర్చకపోగా.. మేము అలా చెప్పలేదు.. మేము ఇలా చెప్పాము అంటూ వాణిజ్య ప్రకటనలు గుప్పించే ప్రకటనల కింద చిన్న నక్షత్రం మార్కులో కండిషన్స్ అప్లై అని పెట్టినట్లుగా నేతలు కూడా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నా.. అదే తరహాలో వ్యవహరించారు మరో మంత్రి.

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తరువాత వచ్చిన తొలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి.. అసలు దేశంలో నోట్ల రద్దు సమస్యే లేదని చాటిచెప్పిన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఎన్నికలకు ముందు మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం తీసుకోస్తామని, నేరాలను పూర్తిగా అదుపు చేస్తామని హామీలు గుప్పించిన నేతలు.. ఎకంగా ఎన్నికలు ముగిసి అధికార పీఠాన్ని అధిరోహించగానే మాట మార్చమార్చారు. తమ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా మార్చలేమని తేల్చిచెబుతున్నారు. అసలు తాము అలాంటి హామీనే ఇవ్వలేదని తెగేసి చెబుతున్నారు.

యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వంలోని టాఫ్ మినిస్ఠర్ గా వున్న సురేశ్ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ను నేరరహిత రాష్ట్రంగా మార్చడం కష్టమని అన్నారు. రాష్ట్రంలో నేరాలను పూర్తిగా అదుపు చేయలేమని చెప్పేశారు. మరో అడుగు ముందుకేసిన ఆయన ఉత్తర్ ప్రదేశ్ ను నేర రహిత రాష్ట్రం చేస్తామని తమ ప్రభుత్వం హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మాత్రమే తాము చెప్పామని అన్నారు. ఇక అందుకు కారణాన్ని కూడా విశ్లేషించారు. తమది చాలా పెద్ద రాష్ట్రమని ఇంత పెద్ద రాష్ట్రంలో నేరాలు ఎక్కడ, ఎలా జరుగుతాయో తెలియదని అన్నారు.

అంతటితో ఆగకుండా ఇంతపెద్ద రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రం చేయడం కష్టమని, అయినా నేరరహితం చేస్తామని మేమేప్పుడూ చెప్పలేదని అన్నారు. నేరస్తులకు కళ్లెం వేస్తామని తాను హామీయిస్తున్నా’నని సురేశ్‌ ఖన్నా అన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై అత్యాచారం చేసి, ఇంటి యజమానిని హత్య చేసిన నేపథ్యంలో మంత్రి ఈవిధంగా స్పందించారు. ఖన్నా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. శాంతిభద్రతల పరిరక్షణలో బీజేపీ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు మరింత కాక రాజేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Khanna  minister  controversial comments  zero crime  Uttar Pradesh  

Other Articles