దేశంలోనే సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన తాజాగా తమిళనాడులో నూ పునరావృతమైంది. పదిహేనేళ్ల చిన్నారిపై ముగ్గురు కామాంధులు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తల్లిదండ్రులతో పోట్లాడి ఇంట్లోంచి వచ్చేసిన చిన్నారిని.. పైశాచిక మృగాలు చిదిమేశాయి. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏదో విషయమై తల్లిదండ్రులు మందలించారని వారితో గొడవపెట్టుకుని ఇల్లు వదిలి వచ్చేసింది వలసయ్యూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న కిచ్చిపాళయం కు చెందిన మైనర్ బాలిక.
ఎక్కడికి వెళ్లాలో తెలియక సేలం పాత బస్టాండ్‌కు చేరకున్న బాలిక.. సేలం నుంచి శివార్లలోని కరుప్పూరు ఇంజనీరింగ్ కళాశాల మద్య మార్గాలకు నడిచే ప్రైవేట్ బస్సు కనిపించడంతో అందులో ఎక్కి టికెట్ తీసుకుని కూర్చుంది. కరుప్పూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రయాణికులంతా దిగిపోగా బాలిక మాత్రం ఒంటరిగా మిగిలింది. ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ మణివణ్ణన్ (33) బస్సు నడుపుతూ బాలికతో మాటలు కలిపాడు. అంతలో రెండో డ్రైవర్ మురుగన్ (35) కూడా అమెను మాట్లలో పెట్టాడు. దీంతో బస్సును కరుప్పూరుకు తీసుకెళ్లకుండా నారాయణపాళయం గ్రామం వైపు బస్సును మళ్లించారు.
విషయాన్ని గమనించిన బాలిక కంగారుపడి బాలిక కేకలు వేయగా ఆమె నోట్లో రెండో డ్రైవర్ మురుగన్, కండక్టర్ పెరుమాళ్ గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత మురుగన్ బస్సు నడుపుతుండగా మణివణ్ణన్ కూడా వచ్చి మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బస్సును సుమారు గంటకు పైగా వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ బాలికపై ముగ్గురు వంతుల వేసుకుని మరీ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక రోదనలు విన్న స్థానికులు కొందరు అర్థరాత్రి బస్సును అడ్డగించి నిలిపివేసి చూడగా, తమ అనుమానం నిజం కావడంతో ముగ్గురి దుర్మార్గులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more