Vice-President Venkaiah visit to home state ఉపరాష్ట్రపతి వెంకయ్య ర్యాలీలో అపశృతి

Grand welcome for vice president venkaiah naidu in home state

drone camera, drone encounter at Vice Presidents vehicle, venkaiah naidu, chandrababu naidu, ESL Narasimhan, maiden visit, amaravati, Vijayawada, Vice-President, M. Venkaiah Naidu, maiden visit, rousing reception, traffic curbs, Andhra pradesh

The police used drone cameras to get live aerial views of the entire route and act of vice president venkaiah naidu maiden tour to home state after assuming office, A police drone cam encountered a tree and fallen near vice presidents vehicle.

ITEMVIDEOS: ఉపరాష్ట్రపతి వెంకయ్య ర్యాలీలో అపశృతి

Posted: 08/26/2017 05:46 PM IST
Grand welcome for vice president venkaiah naidu in home state

దేశ ఉప రాష్ట్రపతిగా బాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నవ్యాంధ్ర రాష్ట్రానికి వచ్చిన  వెంకయ్యనాయుడుకు విజయవాడలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్‌ జీపులో ర్యాలీగా బయల్దేరిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారి పొడవునా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ ర్యాలీని పై నుంచి డ్రోన్‌ కెమెరాతో పోలీసులు చిత్రీకరిస్తున్నారు.

ఏలూరు రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రికి ర్యాలీ చేరుకోగానే.. రహదారి పక్కనున్న చెట్టు కొమ్మల్లో డ్రోన్‌ కెమెరా చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తుండగానే వెంకయ్య ప్రయాణిస్తున్న వాహనం సమీపించింది. అదే సమయంలో పై నుంచి ఒక్కసారిగా డ్రోన్‌ కుప్పకూలింది. వెంకయ్యకు అతి సమీపంలోనే డ్రోన్‌ పడింది. దీంతో ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వూహించని పరిణామంతో భద్రతా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఘటనతో డ్రోన్‌ పాక్షికంగా దెబ్బతినడంతో మరో పరికరాన్ని తెప్పించి చిత్రీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drone camera  venkaiah naidu  chandrababu naidu  maiden visit  amaravati  Andhra pradesh  

Other Articles