dalit woman gang raped by youths in theatre దళిత యువతిపై సినిమా థియేటర్ లో గ్యాంగ్ రేప్

Dalit woman gang raped by youths in theatre 2 arrested

Dalit woman gang rape, dalit woman gangraped in theatre, love jihad in uttar pradesh, Mawana, rape survivor, Amiruddin, Wasim, Kamal Theatre, Pallavpuram area, Hastinapur, Umesh Nath Mishra, crime

A 27-year-old Dalit woman was allegedly gang-raped by two youths in a theatre at Mawana here on Tuesday evening. Police claimed that the rape survivor had accompanied a youth she knew and was gang-raped by the latter and his friend who showed up later.

దళిత యువతిపై సినిమా థియేటర్ లో గ్యాంగ్ రేప్

Posted: 12/08/2017 03:52 PM IST
Dalit woman gang raped by youths in theatre 2 arrested

పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ముసుగులో అమెను వంచిచాడు ఓ మగమృగం. తన స్నేహితుడితో కలసి సినిమా థీయేటర్ లోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సినిమా చూద్దామని హాలుకు తీసుకెళ్లాడు. అంతకుముందే తన స్నేహితుడిని కూడా సమాచారం అందించాడు. ఇద్దరూ కలసి ముందస్తుగానే ప్రణాళికను వేసుకున్నారు. బాల్కానీ టికెట్లు తీసుకున్న వీరు లోపలికి వెళ్లి కూర్చన్నారు. అక్కడ వీరు ముగ్గురు తప్పా మరెవరూ లేరు. దీన్ని అదునుగా తీసుకున్న ఆ ఇద్దరు యువకులు.. దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని మవానాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టుచేశారు. వారిని అమిరుద్దీన్, వసీంగా గుర్తించారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 376డి (గ్యాంగ్ రేప్) కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవ్ పురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల దళిత యువతి హస్తినాపూర్‌లోని ఓ ఎంబ్రాయిడరీ షాప్‌లో పనిచేస్తోంది. అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. అమర్ అనే పేరుతో ఆమెను పరిచయం చేసుకున్న అమిరుద్దీన్.. ఆ తరవాత ఆమెకు సన్నిహితుడిగా మారాడు.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సినిమాకని చెప్పి ఆమెను మవాన్ లోని కమల్ థియేటర్ కు తీసుకెళ్లాడు. అమిరుద్దీన్ స్నేహితుడు వసీం థియేటర్‌లో వీరితో చేరాడు. వీరు ముగ్గురూ కలసి బాల్కానీలో కూర్చున్నారు. బాల్కానీలో వీరు తప్ప ఇంకెవరూ లేరు. దీన్ని అదునుగా తీసుకున్న అమిరుద్దీన్, వసీం ఆమెను రేప్ చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు ఘటనపై ఫిర్యాదు చేసింది. ఇది రెండు సామాజిక వర్గాలకు చెందిన వివాదంగా మారిపోయింది.

దీంతో రంగంలోకి దిగిన వీహెచ్పీ సభ్యులు నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చేదాటిపోతుందని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలించి.. స్థానిక బస్ స్టేషన్‌లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించనున్నట్లు మవానా సర్కిల్ ఆఫీసర్ ఉమేశ్ నాథ్ మిశ్రా చెప్పారు. హాలులో రేప్ జరుగుతున్నా థియేటర్ సిబ్బంది గ్రహించకపోవడం పట్ల విచారణ జరుపుతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles